KTR and Kavitha|కేటీఆర్, కవిత మధ్య పార్టీ డివైడ్ అయిపోతోందా ?
జరిగిందాన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే పార్టీలో ఇద్దరి మద్దతుదారుల్లో స్పష్టమైన డివిజన్ వచ్చేసిందని.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీఅధినేత కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) అత్యంత కీలకంగా ఉన్నారు. అయితే ఇదేసమయంలో మాజీమంత్రి, సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao), కేసీఆర్ కూతురు కవిత(Kavitha) కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు. వారసత్వంగా చూసుకుంటే పార్టీ పూర్తిస్ధాయిపగ్గాలు అయితే కేటీఆర్ లేదా కవితకు మాత్రమే దక్కుతుంది. కాని వీళ్ళిద్దరికన్నా పార్టీనేతల్లో మెజారిటి ఆమోదం హరీష్ రావువైపే ఉందనే ప్రచారం ఎప్పటినుండో సాగుతోంది. అందుకనే కేటీఆర్ కు కేసీఆర్ పూర్తిస్ధాయి అధ్యక్షపదవి ఇవ్వటానికి వెనకాడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కేసీఆర్(KCR) సీఎంగా ఉన్నపుడు కేటీఆర్ ను పూర్తిస్దాయి అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనేక కారణాల వల్ల కేసీఆర్ తన ప్రయత్నాలను విరమించుకున్నారు.
ఇపుడు విషయంఏమిటంటే తీహార్ జైలు(Tihar Jail)లో ఆరుమాసాలున్న తర్వాత మూడునెలల క్రితమే కవిత బెయిల్ పై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన రెండునెలలు జనజీవనస్రవంతికి దూరంగానే ఉన్న కవిత ఇపుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. మొదటిసారి నిజామాబాద్ లో కవిత రెండురోజుల క్రితం పర్యటించారు. ఆమె పర్యటనలో హైలైట్ ఏమిటంటే కాబోయే సీఎం కవిత అంటు నేతలు, క్యాడర్ నానా హడావుడిచేశారు. పార్టీ సమావేశంలో కవిత మాట్లాడుతున్నంతసేపు ‘సీఎం కవిత సీఎం కవిత’ అంటు నినాదాలతో హోరెత్తించేశారు. గతంలో ఎప్పుడూ కవితను ఉద్దేశించి నేతలు సీఎం అని నినాదాలుచేసింది లేదు. మరిప్పుడు కొత్తగా కవితను సీఎం సీఎం అని ఎందుకు నినాదాలుచేశారో అర్ధంకావటంలేదు.
సీన్ కట్ చేస్తే బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ నేతలతో కేటీఆర్ సమవేశం అయ్యారు. పార్టీఆఫీసులో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సమయంలో ‘కాబోయే సీఎం కేటీఆర్’ అంటు నేతలు, క్యాడర్ పెద్దగా నినాదాలిచ్చారు. కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం సీఎం అంటు నేతలు, క్యాడర్ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. నిజామాబాదులో కవితను నేతలు, క్యాడర్ సీఎం సీఎం అనంటే హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కేటీఆర్ ను నేతలు, క్యాడర్ సీఎంసీఎం అటు నానా గోలచేశారు. జరిగిందాన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే పార్టీలో ఇద్దరి మద్దతుదారుల్లో స్పష్టమైన డివిజన్ వచ్చేసిందని. ఇలాంటి ఘటనలు పార్టీలో గతంలో ఎప్పుడూ జరగలేదు. కేటీఆర్, కవితను ఉద్దేశించి నేతలు, క్యాడర్ సీఎం సీఎం అని నినాదాలు చేస్తే మరి కేసీఆర్ పరిస్ధితి ఏమిటి ? అనే అనుమానాలు రెండువర్గాలకు సంబంధంలేని నేతలు, క్యాడర్లో పెరిగిపోతోంది. వీళ్ళముగ్గురి వ్యవహారాన్ని పక్కనపెట్టేస్తే హరీష్ సంగతేమిటి ? అనే చర్చ మొదలైంది.
కేసీఆర్ కన్నా హరీషే ఎక్కువగా పార్టీ పటిష్టత కోసం కష్టపడ్డారనే అభిప్రాయం మెజారిటి నేతల్లో ఉంది. అందుకనే కేసీఆర్ తర్వాత నేతల్లో మెజారిటి మద్దతు హరీష్ కే ఉందనే టాక్ ఎప్పటినుండో నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే కొంతమంది కవితను ఇంకొంతమంది కేటీఆర్ ను సీఎంగా ప్రొజెక్టు చేస్తుంటే మరి హరీష్ రావు సంగతేమిటి అనే చర్చ కూడా పెరిగిపోతోంది. పార్టీలో ఇంతజరుగుతున్నా అధినేత కేసీఆర్ మాత్రం తనకేమీ పట్టనట్లు చూస్తు కామ్ గా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.