ఐటీ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మీ ఆత్మహత్య
x

ఐటీ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మీ ఆత్మహత్య

వృత్తిపరమైన ఒత్తిడా? కుటుంబం కలహాలా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం 11:15 గంటలకు ఈ ఘటన జరిగింది. సీజీవో టవర్స్‌ సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో కలిసి వివరాలు సేకరించారు. సీజీవో టవర్స్‌పై నుంచి దూకడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె ఆత్మహత్యకు ఏం కారణమై ఉండొచ్చని అని అన్న కోణాల్లో దర్యాప్తును ముందుకు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిడా? కుటుంబం కలహాలా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Read More
Next Story