
అలాంటి వారిపై కేసుల నమోదు తగదు:హైకోర్టు
ఎఫ్ ఐ ఆర్ నమోదుకు ముందే చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నల్లబాలుపై వేర్వురు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది." విమర్శనాత్మక రాజకీయ ప్రసంగాల పై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయవద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది, సోషల్ మీడియాలో శత్రుత్వాన్ని పెంచి పోషించిన వారిపై, దేశద్రోహం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రాథమికంగా ఆధారాలు ఉంటేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని కూడా పేర్కొంది. రాజకీయ ప్రసంగాలకు సంబంధించిన విషయాలలో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే చట్టపరమైన అభిప్రాయం పొందాలని కోర్టు అభిప్రాయపడింది.ప్రాథమిక హక్కులను కాపాడటానికి అనుసరించాల్సిన సమగ్ర మార్గదర్శకాలను జస్టిస్ ఎన్ తుకారాంజీ జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ సామాజిక మాద్యమం ఎక్స్ లో చేసిన పోస్ట్‌లపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.