‘కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ను దూరం చేయడే కవిత ప్లాన్’
x

‘కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ను దూరం చేయడే కవిత ప్లాన్’

కవిత.. హరీష్‌పై వచ్చిన విమర్శల విషయంలో మౌనం ఎందుకు పాటించారు? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ను దూరం చేయడమే కవిత ప్లాన్‌లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించిన కవిత చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగానే కవిత వ్యాఖ్యలను తవ్రంగా ఖండించారు. అసలు కవిత.. బీఆర్ఎస్‌లో ఉన్నారా? లేరా? అనేది స్పష్టంగా చెప్పాలని కోరారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన కవిత.. హరీష్‌పై వచ్చిన విమర్శల విషయంలో మౌనం ఎందుకు పాటించారు? అని ప్రశ్నించారు. కవితను చూస్తుంటే కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంలానే అనిపిస్తుందని అన్నారు.

‘‘కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ నేతలందరినీ దూరం చేయడానికే కవిత ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాయి ఆమె విమర్శలు. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిరోజూ వస్తే పార్టీ మళ్లీ పుంజుకుంటుందని కవిత అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని కవిత స్వయంా అంగీకరించారు. అదే విధంగా నల్లగొండ జిల్లాకు కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయంపై కవిత ప్రశ్నించి ఉంటే ఇంకా బాగుండేది’’ అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Read More
Next Story