మల్లారెడ్డి కొడుకు నివాసంపై ఐటీ సోదాలు..
x

మల్లారెడ్డి కొడుకు నివాసంపై ఐటీ సోదాలు..

లావాదేవాలకు సంబంధించి భద్రారెడ్డి, ఆయన కుటుంబీకులను అధికారులు ప్రశ్నించారు.


మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తనయుడు సీహెచ్ భద్రారెడ్డి నివాసంపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. మల్లారెడ్డి హాస్పిటల్స్, సుదారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కూడా సోదాలు నిర్వహించిన కొన్ని రోజులకే భద్రారెడ్డి నివాసంపై దాడులు చేయడం కీలకంగా మారింది. హాస్పిటల్స్, కాలేజీల ద్వారా భారీ ఎత్తున లావాదేవాలు జరిగాయని సమాచారం అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. ఈ లావాదేవాలకు సంబంధించి భద్రారెడ్డి, ఆయన కుటుంబీకులను అధికారులు ప్రశ్నించారు. ఈ సోదాల నేపథ్యంలో ఇంట్లో వారి సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఎవరూ బయటకు వెళ్లకూడదని సూచించారు. అయితే మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించి సంస్థలు, కుటుంబీకుల నివాసాలపై దాడులు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం కూడా చేసుకుంది.

Read More
Next Story