
ఖైదీల్లో మార్పు తెచ్చే బాధ్యత సిబ్బందా..!
పదేళ్ల తర్వాత ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్‌కు వేదికయిన తెలంగాణ.
దోషుల్లో మార్పు తీసుకురావడం కోసమే వారిని జైళ్లలో ఉంచడం జరుగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్‌కు ఆయన హాజరయ్యారు. తెలంగాణ జైళ్ల శాఖ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగానే ఆయన ఖైదీల్లో మార్పు తీసుకురవాల్సిన బాధ్యత జైలు సిబ్బందిదన్నారు. ‘‘పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ ఈ ప్రోగ్రాం జరుగుతోంది. ఇది పోటీ కాదు. క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితభావం పెంపొందించడానికే. జైలు సిబ్బంది తమ ప్రతిభను గుర్తుంచుకోవాలి. భద్రతా విధులు నిర్వహిస్తూ జైధీలలో మార్పు తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన టెక్నాలజీ, వృత్తి శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో మనసును అభివృద్ధి చేసుకోవడం అసలైన లక్ష్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
231 మంది ఖైదీలు విడుదల..
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కింద 231 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారు కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. కొందరికి పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వచ్చాయి. మహిళలకు కుట్టు మెషిన్లు ఇచ్చారు. ‘‘సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లలో కొత్త సిబ్బంది వచ్చారు. సిద్దిపేట జిల్లా జైలును ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రిజన్ డ్యూటీ మీట్ అందరికీ మంచి అనుభూతి కలిగించడంతోపాటు జైలు సంస్కరణలు చేపట్టడానికి శిక్షణలా ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు.