రాజ్‌భవన్‌లో జమ్మూ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాజ్‌భవన్‌లో జమ్మూ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో జమ్మూ ఆవిర్భావ దినోత్సవాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జరిపారు. దేశ ఐక్యత, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేందుకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
- పరస్పర అవగాహన, భారతదేశం యొక్క విభిన్న భాషలు, సంప్రదాయాలు, స్నేహం శాశ్వత బంధాలను ఏర్పరుస్తుందని గవర్నర్ చెప్పారు.జమ్మూ, కశ్మీర్, లడఖ్ పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు.
- ‘‘నేను హిమాలయాల్లో ఉన్న సమయంలో ఆధ్యాత్మికతకు ఆకర్షితుడయ్యాను,పర్వతాల గొప్పతనం చూశాను’’ అని గవర్నర్ చెప్పారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గవర్నర్ వర్మ పలువురు ప్రముఖులను కూడా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం,బ్రిగేడియర్ సంజయ్ వి కులకర్ణి, కమాండర్ 47 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్, కల్నల్ అభిషేక్ పోత్దార్, జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ పదాతి దళం, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.
Next Story