అమీర్‌పేట్‌లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. దేని కోసమో..!
‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి జాన్వీ కపూర్. దివంగత నటి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసినప్పటికీ తన టాలెంట్, అందంతో దూసుకెళ్తోంది జాన్వీ.
‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి జాన్వీ కపూర్. దివంగత నటి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసినప్పటికీ తన టాలెంట్, అందంతో దూసుకెళ్తోంది జాన్వీ. తన యాక్టింగ్ స్కిల్స్‌తో అతి తక్కువ కాలంలో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఒకవైపు గ్లామర్ పాత్రలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అదరగొట్టేస్తోంది. తాజాగా ‘దేవర’ సినిమా తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో జాన్వీ స్టార్ తిరిగినట్లయింది. వరుస అవకాశాలు అందుకు ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా రామ్ చరణ్ అప్‌కమింగ్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కూడా కొట్టేసింది. వీటితో పాటు నేచురల్ స్టార్ నానీ, నాగచైతన్య సరసన నటించే అవకాశాలను కూడా సంపాదించేసుకుంది. రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమా కోసం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్న జాన్వీ కపూర్.. సమయం దొరికినప్పుడల్లా నగరంలోని దేవాలయాలను చుట్టేస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు అమీర్‌పేట్.. మధురానగర్‌లో మెరిసింది.
అమీర్‌పేట్ మధురాగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిందీ అందాల తార. దాదాపు అరగంట పాటు పూజలు చేయించిన జాన్వీ కపూర్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ కపూర్ వచ్చిందన్న సమాచారం రావడంతో అభిమానులు భారీ మొత్తంలో ఆలయం దగ్గరకు చరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా బాగుంటుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇందులోనే జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది.
అయితే జాన్వీ.. ఇప్పుడేదో భక్తిని చూపించడంలేదు. ఆమెకు స్టార్టింగ్ నుంచి కూడా కాస్తంత భక్తి ఎక్కువే. తన పుట్టినరోజు, తన తల్లి పుట్టినరోజున తప్పకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీ కపూర్‌కు అలవాటు. అదే విధంగా ప్రత్యేక పండగలకు, ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ప్రత్యేక పూజలు చేయించడం, పూజల్లో పాల్గొనడం జాన్వీకి బాగా అలవాటు. అందులో భాగంగానే విరామం దొరికన సందర్భంగా ఈరోజు మధురా నగర్‌లోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించినట్లు ఆమె టీమ్ చెప్తోంది.