కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే రైతుల కష్టాలకు కారణం: జీవన్ రెడ్డి
x

కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే రైతుల కష్టాలకు కారణం: జీవన్ రెడ్డి

సాగునీటి కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలకు ప్రధాన కారణం గత ప్రభుత్వమేనని అన్నారు.


తెలంగాణ రైతులను సాగునీటి సమస్య సతమతమవుతున్నారు. పలు జిల్లాల్లో పంటలు సాగునీరు లేక ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తెలంగాణ రైతులు పడుతున్న ఈ సాగునీటి సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. సాగునీటి కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలకు ప్రధాన కారణం గత ప్రభుత్వమేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఏకాడికి కాళేశ్వరం, మేడిగడ్డ అంటూ వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు తప్పితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని, కేసీఆర్‌కు అవలంబించిన ఈ సంకుచిత ఆలోచనా విధానం వల్లే ఇప్పుడు రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ వాళ్లు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాకుండా ఎస్‌ఎల్‌బీసీ దగ్గర జరిగిన ప్రమాదంపై కూడా ఆయన స్పందించాడు. అది ప్రమాదం మాత్రమేనని అన్నారు.

‘‘సాగు నీటి సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత. మాజీ సిఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే సాగునిటీ సమస్యకు కారణం. మేడిగడ్డ, కాళేశ్వరం పైనే దృష్టి పెట్టారు తప్ప... తుమ్మెడి హెట్టి ని పట్టించుకోలేదు. తుమ్మెడి హెట్టి వద్ద 148 మీటర్ బ్యారేజ్ కి మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకున్నారు. కానీ తవ్విన కాలువలను రీ-డిజైన్ చేయలేదు. ఆ పని అప్పుడే ఉంటే ఈ రోజు సమస్య వచ్చేది కాదు. మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు నీటి ని తరలించడానికి 4వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆనాటి సిఎం కేసీఆర్. ఇదే నాలుగు వేల కోట్లు తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, తవ్విన కాలువల రీ డిజైన్ చేసి ఉంటే నీటి సమస్య వచ్చేది కాదు’’ అని అన్నారు జీవన్ రెడ్డి.

‘‘కేవలం సొంత అజెండా తో కేసీఆర్ 4వేల కోట్లు ఖర్చు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్ర ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా. తుమ్మెడి హెట్టి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మెడి హెట్టి బ్యారేజ్ నిర్మాణం, తవ్విన కాలువలను రీ -డిజైన్ చేసి సుందిళ్ల వరకు తరలిస్తే సాగునిటీ సమస్య ఉండదు. రానున్న బడ్జెట్ సమావేశం లో ఈ ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించాలి’’ ని కోరుతున్నాను’’ అని తెలిపారు.

‘‘దోమలపెంట వద్ద Slbc లో జరిగిన సంఘటన దురదృష్టకరం. slbc నిర్మాణం కూడా ఆపాల్సిన అవసరం లేదు.. ఎలాగైతే ముందుకు వెళ్ళోచో చూసి నిర్మాణం చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏపీ సర్కార్ మన కృష్ణ నీటిని తరలించుకుపోవాలని చూస్తుంది. మన నీటిని మనం మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాపాడుకోవాలి’’ అని అన్నారు.

Read More
Next Story