Jeevandan | మరణించినా అయిదుగురికి ప్రాణం పోసిన మహిళా డాక్టర్
x
డాక్టర్ భూమిక (ఫొటో : ఎక్స్ సౌజన్యంతో)

Jeevandan | మరణించినా అయిదుగురికి ప్రాణం పోసిన మహిళా డాక్టర్

వైద్యురాలిగా రోగులకు చికిత్స చేయడమే కాకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన డాక్టర్ నంగి భూమిక అయిదుగురికి ప్రాణం పోసిన ఉదంతం తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.


వైద్యురాలిగా రోగులకు చికిత్స చేయడమే కాకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన డాక్టర్ నంగి భూమిక అయిదుగురికి ప్రాణం పోసిన ఉదంతం తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తలుపుల మండలం నంగివడ్లపల్లి గ్రామానికి చెందిన నందకుమార్ రెడ్డి కుమార్తె అయిన డాక్టర్ నంగి భూమిక (24) ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేసేది.
- ఫిబ్రవరి 1వతేదీన భూమిక కారులో వెళుతుండగా ఖానాపూర్ వద్ద ఫిబ్రవరి 1వతేదీన ఆమె కారు డివైడరును ఢీకొంది. వెంటనే తీవ్రంగా గాయపడిన డాక్టర్ భూమికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పారు.

భూమిక కుటుంబానికి సజ్జనార్ శాల్యూట్
మరణించిన డాక్టర్ భూమిక తండ్రి తన కూతురి లివర్, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను అయిదుగురు రోగులకు దానం చేయడంతో వారికి పునర్జన్మ ప్రసాదించారు.తెలంగాణ జీవన్ దాన్ మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ నంగి భూమిక కుటుంబాన్ని ప్రశంసించారు. పుట్టెడు దుఃఖంలో ఔదార్యం చూపిస్తూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన భూమిక కుటుంబ సభ్యులకు టీజీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సెల్యూట్ చేశారు.కుమార్తె మృతి బాధను కూడా లెక్కచేయకుండా దాతృత్వం చూపి తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన భూమిక కుటుంబ సభ్యులకు వందనం అని సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు.


Read More
Next Story