
జోడో యాత్ర ఎంతో నేర్పింది: రాహుల్
రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే దేశం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనను గుర్తు చేస్తూ ప్రారంభించారు. ఉగ్రదాడి ఘటన బాధితులను కలిశానని, ఆ కుటుంబాలను పరామర్శించానని చెప్పారు. దేశంలో పాత రాజకీయం రూపుమాపి.. నవ యువ రాజకీయం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో నవతరం ప్రారంభం కావాలని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయని అన్నారు. రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే దేశం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘భారత్ సమ్మిట్ నిర్వహించినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో పాలకులు..రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలు.. సమస్యలు సంపూర్ణంగా తెలుసుకోలేక పోతున్నారు. భారత్ జోడో యాత్ర నాకు కొత్త అంశాలు నేర్పించాయి. ప్రేమ తో ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు.. సమస్యలు తెలుసుకున్నాను. విద్యా, వైద్యం, సామజిక అంశాలలో వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాము. మహోబ్బత్ కా దుకాణ్.. ఈ స్లోగన్ దేశంలో సంచలనం గా మారింది. దేశంలో నూతన రాజాకీయాలకు, నూతన ఆలోచనలకు ఈ సమ్మిట్ వేదిక అయినందుకు సంతోషంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.