రేపే జూబ్లీహిల్స్ కౌంటింగ్
x

రేపే జూబ్లీహిల్స్ కౌంటింగ్

186 మంది సిబ్బందితో 42 టేబుల్స్‌పై కౌంటింగ్.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఎవరి జెండా ఎగరనుంది? జూబ్లీ విజయం ఎవరిని వరిస్తుంది? బీఆర్ఎస్ మరోసారి విజదుందుబి మోగిస్తుందా? బీఆర్ఎస్‌ విన్నింగ్ స్ట్రీక్‌కు కాంగ్రెస్ బ్రేక్ చేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధారం రేపు వస్తుంది. అదే నవంబర్ 14 శుక్రవారం రోజున ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలువడతాయి. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ ఉపఎన్నికను ప్రధాన పార్మీలు మూడూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నాయి. సిట్టింట్ సీట్ కాపాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తే, జూబ్లీ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావించి.. శర్వశక్తులు ఒడ్డి పోరాడాయి.

18 రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆఖరి క్షణం వరకు కూడా ప్రచారం చేశాయి. పెద్దపెద్ద నేతలను బరిలోకి దించాయి. కాంగ్రెస్ తరుపు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇంటింటికి తిరిగి ఓట్లు కోరారు. వారి కష్టానికి ఫలితం ఏంటి అనేది నవంబర్ 14న తేలనుంది. నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఈ ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు యూసఫ్‌గూడలోని కోట్లవిజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ ప్రక్రియ స్టార్ట్ కానుందని ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ వెల్లడించారు. అంతేకాకుండా పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు.

కౌంటింగ్ కేంద్రంలోకి వారికే ఎంట్రీ: కర్ణన్

‘‘లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఎవరికీ అనుమతి ఉండదు. ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. అందులో మొదట బ్యాలెట్ కౌంటింగ్ చేస్తాం. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మొత్తం 10 రౌండ్లలో జరుగుతంది. ఈసారి ప్రత్యేక అనుమతులు తీసుకుని మొత్తం 42 టేబుల్స్ సిద్ధం చేశాం. కౌంటింగ్‌ను పరిశీలించడానికి స్పెషల్ అధికారిని కూడా నియమించాం. మొత్తం 186 మంది కౌంటింగ్ చేస్తారు. ఆర్ఓ.. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఎల్‌ఈడీ స్క్రీన్స్, ఈసీ యాప్ ద్వారా ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తాం’’ అని వివరించారు.

50శాతం కూడా లేని పోలింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ 50శాతం కూడా లేదు. నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ వారిలో సగానికి పైగా మంది ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఓటు వేయడానికి రాలేదు. దీంతో ఎన్నికలో పోలయిన మొత్తం ఓట్లు 1,95,631 మాత్రమే. వీరిలో పురుషులు 99,771 మంది, మహిళలు 94,855 మంది, ఇతరులు 5గురు మాత్రమే ఓట్లు వేశారు. ఏడు డివిజన్లలోని 30 కాలనీలు, 70 బస్తీల్లో 4.01 లక్షల ఓటర్లున్నారు. వీరిలో మధ్య, దిగువ తరగతి జనాలతో పాటు పేదలే ఎక్కువ. పార్టీల అంచనా ఏమిటంటే పోలైన ఓట్లలో కాలనీల్లోని ఓటర్లకన్నా బస్తీల్లోని ఓటర్లే ఎక్కువమంది ఓటింగులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభకు జనాలు విపరీతంగా హాజరయ్యారు. ఇదే ఊపు పోలింగురోజున కూడా కనబడుతుందని, ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశించిన పార్టీలకు ఓటర్లు పెద్ద షాకిచ్చారు.

Read More
Next Story