వృద్ధ దంపతుల చెంతకు న్యాయం, బెంచ్ దిగి వచ్చిన జడ్జి
x
బెంచ్ దిగి వచ్చి వృద్ధదంపతులను విచారిస్తున్న న్యాయమూర్తి ఈ సాయి శివ

వృద్ధ దంపతుల చెంతకు న్యాయం, బెంచ్ దిగి వచ్చిన జడ్జి

వృద్ధ దంపతుల చెంతకు న్యాయం వచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.నడవలేని వృద్ధ దంపతుల చెంతకు జడ్జి బెంచ్ దిగి వచ్చి న్యాయం చేసిన ఘటన సంచలనం రేపింది.


కోర్టుల్లోని బెంచ్ మీద జడ్జీలు కేసుల విచారణ చేపడుతుండటం సర్వసాధారణం...కానీ నడవలేని వృద్ధ దంపతులు ఆటోలో బోధన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలోకి వచ్చినా కోర్టు హాలులోకి నడిచి రాలేక పోయారు. అంతే వృద్ధ దంపతుల పరిస్థితిని చూసి చలించిపోయిన బోధన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి శివ బెంచ్ దిగి కోర్టు ఆవరణలోకి వచ్చి ఆటో దగ్గర ఉన్న వారిని విచారించి అక్కడికక్కడే సత్వర న్యాయం చేశారు.


అసలు కేసు ఏమిటి?
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన సాయమ్మ, గంగారాం లు వృద్ధ దంపతులు. వీరు వృద్ధాప్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వృద్ధ దంపతులు తనను అదనపు వరకట్నం తీసుకురమ్మని వేధించారని వారి కోడలు కేసు పెట్టింది. వృద్ధ దంపతులకు విచారణకు రావాలని కోరుతూ కోర్టు నుంచి సమన్లు వచ్చాయి.

చలించిన న్యాయమూర్తి...బెంచ్ దిగి వచ్చి...
వృద్ధదంపతులు బలహీనంగా నడవలేని స్థితిలో ఉన్నా, కోర్టు సమన్లతో ఆటోరిక్షా ఎక్కి బోధన్ కోర్టుకు వచ్చారు.వృద్ధ కోర్టు ఆవరణలోకి వచ్చారు కానీ కోర్టు హాలులోకి నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వృద్ధ దంపతుల పరిస్థితిని తెలుసుకున్న బోధన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ సాయి శివ చలించి పోయి బెంచ్ దిగి కోర్టు గది బయట ఆవరణలో ఆటో వద్ద వేచిఉన్న వృద్ధుల వద్దకు వచ్చి వారి కేసు వివరాలను సమీక్షించారు.(Judge who came down from the bench) నడవలేని విధంగా ఉన్న వృధ్ధ దంపతులు కట్నం కోసం కోడలిని వేధించారని పెట్టిన కేసును న్యాయమూర్తి సాయిశివ కోర్టు బయటే విచారించారు.

వృద్ధ దంపతులపై కేసు కొట్టివేత
వృద్ధ దంపతులపై పెట్టిన వరకట్నం వేధింపు కోసు అన్యాయంగా పెట్టారని తెలుసుకున్న న్యాయమూర్తి సాయి శివ అక్కడికక్కడే కేసును కొట్టివేస్తూ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. (Elderly Couple Finally Got Justice)న్యాయమూర్తి బెంచ్ దిగి వచ్చి మానవత్వం, కరుణతో తీసుకున్న చర్య అందరినీ కదిలించింది. వృద్ధ దంపతుల చెంతకు వచ్చి వారి కేసులో న్యాయం చేసిన న్యాయమూర్తి సాయి శివను పలువురు ప్రశంసించారు.

వృద్ధ దంపతుల ఆనందం
తమపై కోడలు పెట్టిన వరకట్నం వేధింపుల కేసును న్యాయమూర్తి కొట్టివేయడంతో వృద్ధ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ దంపతులు భావోద్వేగంతో కళ్లు చెమర్చాయి. న్యాయవ్యవస్థలో సాయిశివ లాంటి న్యాయమూర్తులు ఉంటే న్యాయం గెలుస్తుందని స్థానిక న్యాయవాదులు, ప్రజలు ప్రశంసలు కురిపించారు.


Read More
Next Story