‘నేను పార్టీ మారడానికి కవితే కారణం’
x

‘నేను పార్టీ మారడానికి కవితే కారణం’

ధరణి పేరుతో భూదందా చేసిన ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ అన్న కడియం శ్రీహరి.


రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న కవిత ఎపిసోడ్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడంపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చారు. తాను బయటకు రావడానికి అసలు కారణం కవితే అని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ కలహం అంతా కూడా ఆస్తి పంకాల దగ్గర మొదలైందని, ఆ విషయంలో వారు గొడవలు పడుతున్నారని అన్నారు. దానికి ప్రజల కోసం అన్నట్లు కొందరు కలరింగ్ ఇచ్చుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వనరులు అన్నింటిని దోచుకున్న కుటుంబం కల్వకుంట్ల కుటుంబమని మండిపడ్డారు. వాగి గొడవ అంతా కూడా పదవుల, ప్రజల కోసం కాదని, పూర్తిగా ఆస్తికి సంబంధించినదేనని అన్నారు. ధరణి పేరుతో వాళ్లు చేసిన భూదందా అంతాఇంతా కాదని, వేల ఎకరాల భూములను కబ్జా చేశారని అన్నారు.

‘‘కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్మును పంచుకోవడంలో గొడవలు జరుగుతున్నాయి. వాటిలో వాటా కోసమే వీళ్లు కొట్టుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబం దోపిదీని తట్టుకోలేక ప్రజలు వారిని పక్కనబెట్టారు. ఇప్పుడు వారి కుటుంబంలో జరుగుతున్న పంచాయితీతో రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదు’’ అని ఆయన అన్నారు.

‘’ఆనాడు కవిత.. లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లారు. అందువల్లే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. ఒక సీఎం బిడ్డ.. స్కాంలో విచారణను ఎదుర్కోవడమే పార్టీకి నేను రాజీనామా చేయడానికి ప్రధాన కారణం. ఆమె నెలల తరబడి జైలులో ఉండటం కూడా నన్ను బాధించింది. అది సరైన పద్దతి కాదనిపించింది. అందుకే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాను. వాళ్ల గొడవలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పత్రికలు కూడా వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. దీని వల్ల ప్రజలకు దమ్మిడీ ఆదాయం ఉండదు’’ అని అన్నారు.

కవిత ఆరోపణలేంటంటే..

హరీష్ రావుపై ఘాటు ఆరోపణలు చేసిన కవిత.. ఆయన ప్రవర్తన వల్ల చాలా మంది నేతలు బీఆర్ఎస్‌ను వీడారని అన్నారు. వారిలో కడియం శ్రీహరి కూడా ఒకరిన చెప్పారు కవిత. హరీష్ రావు.. బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకోవాలని పన్నాగాలు పన్నారని, అందులో భాగంగానే కొంతమందిని పట్ల తీవ్ర వైఖరి ప్రదర్శించారని కవిత ఆరోపించారు. ఆయన ఒత్తిడి, వైఖరి తట్టుకోలేక కడియం శ్రీహరి, ఈటల, కోండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు చాలా మంది పార్టీని వీడారు అని అన్నారు. వారు బయటకు వెళ్లిపోవాలనే హరీష్ రావు కోరుకున్నారని, అప్పుడే పార్టీ తనకు ఈజీగా దక్కుతుందని ఆయన భావించారని కవిత అన్నారు. ఆమె చేసిన ఈ ఆరోపణలకు సమాధానంగానే కడియం శ్రీహరి స్పందించారు.

Read More
Next Story