బిఎస్ రాములు ‘చూపు’ నవల మీద ఎంఫిల్ ప్రదానం
x

బిఎస్ రాములు ‘చూపు’ నవల మీద ఎంఫిల్ ప్రదానం

1969 నుండి2014 వరకు తెలంగాణ స్థితిగతులతో నిధులు, నీళ్లు, నియామకాలు, ఏమైపోతున్నాయో యువత ద్వారా తెలియపరిచిన నవల


కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో బిఎస్ రాములు ‘చూపు’ నవల-ఒక పరిశీలన అనే అంశంపై అధ్యయంన చేసినందుకు మోరె రాజుకు ఎం. ఫిల్ డిగ్రీ ప్రధానం చేయబడింది.

సామాజిక తత్వవేత్త బి.ఎస్ రాములు రచించిన 'చూపు' నవల ఎన్నో సామాజికాంశాలను సమాజానికి నేర్పే విధంగా రూపొందించారు. ఈ నవల ఒక వయసు వారికి సంబంధించినది కాదు మూడు తరాలకు సంబంధించిన నవల ఈ నవల మనిషి జీవితంలోని వివిధ దశలకు అద్దం పడుతుంది.

అంటే యుక్త వయసు నుండి మొదలుకొని షష్టిపూర్తి వయస్సు అంతవరకు ఈ నవల మనిషి అను అనువునా తనను తాను చూసుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా 1969 నుండి2014 వరకు గల తెలంగాణ స్థితిగతులను మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు, ఏమైపోతున్నాయో యువత ద్వారా తెలియపరిచారు. తెలంగాణలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను రచయిత తెలియపరిచారు.



తెలంగాణ నిండా సంపదలు ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు వినియోగించుకోకుండా అవి ఆంధ్ర పాలకుల చేతిలో పడిపోతున్నాయని నవలలో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది మేధావులు ఉన్నఅధికారుల తప్పుదోవ వల్ల ఉద్యోగాలు అన్నీ ఆంధ్ర పాలవుతున్నాయని, ఉద్యోగాలు రాక ఇక్కడ యువత గల్ఫ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి వలస జీవితాన్ని గడుపుతున్నారని కళ్లకు కట్టినట్లు నవల చూపిస్తుంది.


మోరే రాజు


అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో పయనిస్తూ,పరవళ్ళు తొక్కుతూ పసిడి పంటలు పండే నీళ్లన్నీ ఆంధ్రా పాలవుతున్నాయని తెలంగాణ దుస్థితిని నాటి కాలమాన పరిస్థితులని వివరించారు. బిఎస్ రాములు సమాజానికి నేను ఇంకా ఏమి చేయాలి అనే తపనతో తన 'లోచూపు'తో మనిషి ప్రవర్తన నియమావళిలో ఎదురవుతున్న సమస్యలని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కార మార్గాన్ని ఎన్నుకోవాలనే విషయాలను వయసుల వారీగా ఈ నవల తెలియచేస్తుంది.

చూపు నవల గురించి ఒక్కమాటలో "మనిషి నడవడికి మార్గదర్శి" చూపు నవల అని చెప్పవచ్చు. పరిశోధనకు పర్యవేక్షకులు విశ్రాంత ఆచార్యులు వేలూరి శ్రీదేవి పర్యవేక్షకులు గా వ్యవహరించారు.

Read More
Next Story