కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఝలకిచ్చిన పార్టీ కార్యకర్తలు
x

కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఝలకిచ్చిన పార్టీ కార్యకర్తలు

నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య కి చేదు అనుభవం ఎదురైంది. చేవెళ్ల పర్యటనలో ఊహించని ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పర్యటనలో ఊహించని ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వాహనంపై కోడిగుడ్లు, టమాటలతో దాడి జరిగింది. ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది.

బుధవారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం కలకలం రేపింది. గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. మాకు న్యాయం చేసే అంత వరకు మేము వినేదిలేదంటూ.. మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Read More
Next Story