Kaleswaram | ‘ఢిల్లీకి మూటలు మోయడం తప్ప ఏం చేశారు’
x

Kaleswaram | ‘ఢిల్లీకి మూటలు మోయడం తప్ప ఏం చేశారు’

అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక అంతా పెట్టండి.. చీల్చిచండాడుతామన్న హరీష్ రావు.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేసీఆరే అసలు దోషి అని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. పాలన చేతకాక కేసీఆర్‌ను బద్నాం చేయాలి, కేసీఆర్‌పై కక్ష తీర్చుకోవాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే "కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు" అంశం పై తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఆయన పలు కీలక అంవాలను లేవనెత్తారు. అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్తున్న కాంగ్రెస్.. కమిషన్ ఇచ్చిన మొత్తం 660 పేజీల బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారాయన.

‘‘రేవంత్‌.. పాలనను గాలికొదిలేశారు. రేవంత్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్ధులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్ట్ బయటపెట్టారు. బిల్లు కావాలంటే 10-12 శాతం కమీషన్లు కావాలి. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలింది. పోలవరంపై NDSA ఎందుకు వెళ్లలేదు. మేడిగడ్డలో చిన్న ఘటన జరగగానే NDSA వచ్చింది. మాకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారు. కుట్ర పూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్ట్ పెడితే ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని హెచ్చరించారు.

‘‘వాస్తవాలను ప్రజల ముందుంచుతాం. 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలపై బయటపెట్టారు. ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది బేస్‌లెస్‌ రిపోర్ట్. దేశంలో ఎన్నో కమిషన్లు వేశారు.. న్యాయస్థానాల ముందు నిలబడవు. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. సీఎం రేవంత్ వరుస సీరియళ్లు నడుపుతున్నారు. కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి దగ్గర దమ్మెడు మట్టి ఎందుకు వేయలేదు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. జీవ సంపద ఉంది, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు’’ అని స్పష్టం చేశారు.

‘‘కన్నేపల్లి దగ్గర మోటార్లు ఆన్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు ధర్నా చేశారు. రెండేళ్ల నుంచి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదు. కేసీఆర్‌ మహారాష్ట్రలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్‌ ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు. 152 మీటర్లకు అగ్రిమెంట్‌ చేస్తే ఎలా తగ్గిస్తారని ఉత్తమ్‌ అన్నారు. ఇంకా గంట 40 నిమిషాలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉంటా. 152 మీటర్లకు ఒప్పుకున్నట్టు ఉత్తమ్‌ అగ్రిమెంట్‌ పత్రం తీసుకొస్తే. ఇక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ఒక్క ఏడాదిలోనే 24 గంటల కరెంటు ఇచ్చారు. మిషన్‌ కాకతీయతో చెరువులను పునఃరుద్దరించారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం. నువ్వు వచ్చినంక ఒక్క కాలువ తవ్విన, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చావా. రెండేళ్లలో ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు. వచ్చే రెండేళ్లలో కూడా రేవంత్‌రెడ్డి చేసేదేమీలేదు’’ అని విమర్శించారు.

‘‘ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లారు తప్ప చేసిందేమీ లేదు. కాటన్ బ్యారేజీ కట్టినా కమిషన్ వేసి వేధించారు. అయినా కాటన్ గోదావరి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. కేసీఆర్‌కు కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు. కాళేశ్వరం ముమ్మాటికీ వర ప్రదాయినే, రేవంత్‌కు కూడా తెలుసు. కాళేశ్వరం కూలిందన్నోడు గంధమల్లకు కొబ్బరికాయ ఎట్ల కొడుతాడు. మల్లన్నసాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తానని చెబుతున్నాడు. కేసీఆర్‌ చేసింది వందేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నిర్మాణం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడి లెక్క మాట్లాడుతున్నారు. ప్రాణహిత-చేవెళ్లలో పెట్టిన ఖర్చు రూ. 3,700 కోట్లు మాత్రమే. రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్‌ చెబుతున్నాడు. మొబిలైజేషన్‌ అడ్వాన్లు పేరుమీద రూ. 2 వేల కోట్లు దొబ్బారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read More
Next Story