ప్రభుత్వానికి అందిన పీసీ ఘోష్ కమిషన్
x

ప్రభుత్వానికి అందిన పీసీ ఘోష్ కమిషన్

నివేదికలో ఏముంది.. ప్రభుత్వం ఎలాంటి చర్చలు తీసుకోవచ్చు.


కాళేశ్వరం లిఫ్ట్ రిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై చేసిన విచారణకు సంబంధించిన నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. జులై 31తో కమిషన్ గడువు ముగుస్తున్న క్రమంలో పీసీ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. అసలు కమిషన్ నివేదికలో ఏముండొచ్చు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే అంశాలపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతకవలపై కమిషన్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయనుంది? అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారింది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతకవల విషయంలో నిగ్గుతేల్చడం కోసం పీసీ ఘోష్ కమిషన్.. దాదాపు 120 మంది అధికారులకు విచారించింది. పలువురు ముఖ్యనేతలను కూడా విచారణ చేసింది. అధికారుల వాంగ్మూలాల ఆధారంగా నేతలను విచారించింది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన పలువురు ఇంజీనర్లకు నుంచి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న అంశాన్ని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొందా? అనే అంశం ప్రస్తుతం కీలకంగా మారింది.

కమిషన్ ఎపుడొచ్చింది...

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయిం ది. బరాజ్ లోని ఏడో బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ), ఇటు విజిలె న్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. న్యాయపరంగా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ను నియమించారు.

2024 జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలుకాలేదు. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడి గించింది. మళ్లీ విచారణ నత్తనడకే సాగింది. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణకు ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు పొడిగి స్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జులై 31 వరకు కమిషన్ రిపోర్టుకు గడువు ఇచ్చింది.

Read More
Next Story