కవిత సెల్ఫ్ మార్కెటింగ్ అదుర్స్
x
Kalvakuntla Kavitha

కవిత సెల్ఫ్ మార్కెటింగ్ అదుర్స్

ఏ ప్రోడక్టుకైనా సెల్ఫ్ మార్కెటింగ్ చాలా అవసరం. మల్టీనేషనల్ కంపెనీల నుండి వీధి చివరన ఉన్న బడ్డీకొట్టువరకు మార్కెటింగ్ టెక్నిక్స్ అవంభించాల్సిందే.


ఏ ప్రోడక్టుకైనా సెల్ఫ్ మార్కెటింగ్ చాలా అవసరం. మల్టీనేషనల్ కంపెనీల నుండి వీధి చివరన ఉన్న బడ్డీకొట్టువరకు మార్కెటింగ్ టెక్నిక్స్ అవంభించాల్సిందే. ఇపుడీ విషయం ఎందుకంటే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) చెప్పిన మాటలను గమనించిన తర్వాత ఆమెకు సెల్ఫ్ మార్కెటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కవిత ఆధ్వర్యంలో జాగృతి సంస్ధలో ‘లీడర్’..నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఇల్లాలే మొదటి లీడర్ అన్నారు. ఇల్లాలు ఇంట్లో భర్తకేమి కావాలి, పిల్లలకు ఏమికావి అనేది జాగ్రత్తగా గమనించి అందిస్తుందట. జ్వరమొచ్చి రెండురోజులు ఇల్లాలు పడుకుంటే అప్పుడు తెలుస్తుందట అందరికీ ఇల్లాలు ఎంత ముఖ్యమో.

లీడర్ అన్నవాడు ఆకాశంలోనుండి ఊడిపడడని, మనలోనుండే తయారవుతాడనే గట్టి సత్యాన్ని కవిత చెప్పారు. పుట్టేటపుడు అందరు మామూలుగానే పుడతారని, అయితే పెరుగుతున్నపుడు నేర్చుకుంటు తనని తాను మార్చుకుంటు ఎదిగేవాడే లీడర్ అవుతాడని కవిత చెప్పారు. అందరికన్నా నాయకత్వ లక్షణాలు ఇల్లాలికే ఎక్కువగా ఉంటుందని కవిత తెలిపారు. ఇక్కడే కవిత మార్కెటింగ్ టెక్నిక్స్ అర్ధమవుతోంది. ఇల్లాలే మొదటి లీడర్, మహిళలకే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పటం ద్వారా తనలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పరోక్షంగా చెప్పటమే. మహిళగా, ఇల్లాలిగా తాను సక్సెస్ ఫుల్ అని కవిత చెప్పదలచుకున్నారు. కాబట్టే తాను గొప్పలీడర్ ను అని వేదికమీద ప్రకటించుకున్నారు.

జాగృతి సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన లీడర్ శిక్షణా కార్యక్రమాల్లో జాగృతి(Telangana Jagruthi) సంస్ధను జనాల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకే అని అర్ధమవుతోంది. ఇందులో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యంగా ఆమె పరోక్షంగా చెప్పటం గమనార్హం. ఇదేసమయంలో తన అన్న, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పోల్చుకుంటే తనకే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం కూడా కవిత ఉద్దేశ్యం అయ్యుండచ్చు. బీఆర్ఎస్ లో ఇపుడు కవితను పట్టించుకునే వారు లేరన్న విషయం అర్ధమవుతోంది. తనను లిక్కర్ క్వీన్(Liquor queen) అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించినపుడు సొంతపార్టీ నేతలు తనకు అండగా నిలవలేదని స్వయంగా కవితే వాపోయారు. అలాగే కవితను ఉద్దేశించి ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు కూడా బీఆర్ఎస్ నేతల్లో ఏ ఒక్కరూ మద్దతుగా మాట్లాడలేదు.

టెక్నికల్ గా కవిత ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నా ముందుజాగ్రత్తగా జాగృతిని బోలోపేతంచేయాలని అనుకున్నారు. అందుకనే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కొందరిని జాగృతి సంస్ధలో చేర్చుకుంటున్నారు. ఇపుడేమో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు లీడర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సెల్ఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎంతవరకు వర్కవుటవుతాయో చూడాల్సిందే.

Read More
Next Story