
Kavitha | కవిత చెప్పిన లిల్లీపుట్ నేత ఎవరు ?
లిల్లీపుట్ నాయకుడు నల్గొండ(Nalgonda) జిల్లాలో పార్టీని నాశనంచేశాడు అని గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే విరుచుకుపడ్డారు
బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ సీనియర్ నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత(Kavitha) మీడియాతో మాట్లాడుతు పేరు ప్రస్తావించకుండానే నల్గొండజిల్లాలోని మాజీమంత్రిని ఉద్దేశించి లిల్లీపుట్(Lilliput leader) నేత అని అన్నారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ(Nalgonda) జిల్లాలో పార్టీని నాశనంచేశాడు అని గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే విరుచుకుపడ్డారు. తనసీటును అతికష్టంమీద గెలుచుకున్న సదరు లిల్లీపుట్ నేత మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ గెలవకుండా నాశనంచేసేశాడు అని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా తనగురించి నీచంగా మాట్లాడుతాడా అని నిలదీశారు. లిల్లీపుట్ నేత తనగురించి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల వెనుక పార్టీలోని కీలక నేతే ఉన్నట్లు పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు గుప్పించారు.
కేసీఆర్ లేకపోతే ఈ లిల్లీపుట్ నేత ఎక్కడుండేవాడు అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనని ఈ లిల్లీపుట్ నేతకు అసలు బీఆర్ఎస్ తో ఏమి సంబంధం అని ప్రశ్నించటం సంచలనంగా మారింది. లిల్లీపుట్ నాయకుడితో పాటు చోటామోటా నేతలు తనపైన నోటికొచ్చినట్లు మాట్లాడటం వెనుక పెద్ద నాయకుడు ఉన్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ లో పెద్దనాయకులు వెనకనుంచి తనను లిల్లీపుట్ నేతలతో ఆరోపణలు చేయిస్తున్నట్లు కవిత చెప్పారు. తనపై లిల్లీపుట్, చోటామోటా నేతల వెనుక పార్టీలోని పెద్ద నాయకుడే ఉన్నారన్న విషయం తన దగ్గర అన్నీ ఆధారాలున్నాయని సమయం వచ్చినపుడు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై దీక్షగురించి మాట్లాడుతు ప్రభుత్వానికి లేఖ రాసినా ఇంతవరకు స్పందనలేదన్నారు. అందుకనే దీక్షకుఅనుమతి ఇచ్చేట్లుగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులో పిటీషన్ కూడా వేసినట్లు చెప్పారు. కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ కోర్టు కూడా స్పందించకపోతే తనింట్లోనే దీక్ష చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనమీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలుచేసినపుడు తెలంగాణసమాజం అంతా స్పందించినా తనపార్టీ స్పందించకపోవటం దారుణమన్నారు. ఎందుకు స్పందించలేదన్న విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. అంతా బాగానే ఉందికాని కవిత లిల్లీపుట్ అని ప్రస్తావించిన బీఆర్ఎస్ నేత ఎవరన్నదే తెలీలేదు.