
‘వాటాల గొడవతోనే కవిత సస్పెన్షన్’ : బొమ్మ
‘‘సంపాదన, వాటాల విషయంలో వాళ్ళతో లెక్కలు తేలకపోవటంతోనే కవిత వాళ్ళపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న’’ట్లు బొమ్మ అభిప్రాయపడ్డారు.
కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు, విమర్శలను పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) కొట్టిపారేశారు. ‘‘అధికారంలో ఉన్నపుడు అక్రమసంపాదన విషయంలో వాటాల కోసమే ఇపుడు కవిత ఆరోపణలు చేస్తున్న’’ట్లు బొమ్మ మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నపుడు సంపాదించిన దానిలో కవిత(Kavitha)కు షేర్ వచ్చినట్లు లేద’’ని ఎద్దేవా చేశారు. అందుకనే ఇపుడు హరీష్ రావు(Harish Rao), జోగినపల్లి సంతోష్ పైన కవిత ఆరోపణలు చేస్తున్నట్లు బొమ్మ చెప్పారు. ‘‘సంపాదన, వాటాల విషయంలో వాళ్ళతో లెక్కలు తేలకపోవటంతోనే కవిత వాళ్ళపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న’’ట్లు బొమ్మ అభిప్రాయపడ్డారు.
‘‘హరీష్, సంతోష్ అవినీతి సంపాదనపై అధికారంలో ఉన్నపుడు కవితకు సమాచారం తెలీదా’’ ? అని బొమ్మ నిలదీశారు. ‘‘ఇపుడు చేస్తున్న ఆరోపణలు అప్పట్లోనే ఎందుకు చేయలేద’’ని ప్రశ్నించారు. ‘‘హరీష్, సంతోష్ అవినీతికి పాల్పడటం కేసీఆర్ కు తెలీకుండానే జరిగిందా’’ అని ఎద్దేవాచేశారు. ‘‘కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అందరికీ తెలిసిందే అని, అప్పట్లో వాటాలు కుదరకే ఇఫుడు నేతలంతా రోడ్డున పడుతున్న’’ట్లు బొమ్మ చెప్పారు. ‘‘బీఆర్ఎస్ లో జరుగుతున్న గొడవల్నీ ప్రైవేటు అఫైర్’’ అని బొమ్మ అభివర్ణించారు. ‘‘వాళ్ళ పార్టీలో జరుగుతున్న గొడవలపై స్పందించాల్సిన అవసరం తమకు లేద’’న్నారు.
‘‘కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల తగాదా, వాటాల తగాదా ఎప్పటినుండో నడుస్తున్న’’దే అన్నారు. ‘‘ఆ తగాదాలే ఇపుడు కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ కు దారితీసుండచ్చ’’ని బొమ్మ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోని ఏ నేత వెనుక ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.