‘బీఆర్ఎస్.. నా దారికి రావాల్సిందే’
x

‘బీఆర్ఎస్.. నా దారికి రావాల్సిందే’

ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పు.


బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని కూడా చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగానే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్‌కు సంబంధించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కూడా చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే సమర్థిస్తున్నట్లు కూడా కవిత చెప్పుకొచ్చారు.

‘‘తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై BRS పార్టీ స్పందించకపోవడం విచారకరం. బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ సరైనదే. ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పు. నిపుణులతో సంపూర్ణంగా చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు మద్దతు తెలిపా. BRS నాయకులు నా దారికే రావాల్సిందే. నాలుగు రోజులు టైమ్ తీసుకున్నా.. అదే జరుగుతుంది. 2018 చట్ట సవరణ చేసిన ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టే’’ అని అన్నారు.

మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి..

ఈ సందర్భంగానే తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకుగానూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో మల్లన్నకు వారే మద్దతు ఇచ్చి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని భావించాల్సి ఉంటుందని తెలిపారు.

బనకచర్లపై జాగృతి పోరాడుతుంది..

‘‘ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పండగ వాతావరణం కనిపించింది. అందులో చర్చించిన తొలి అంశం బనకచర్లే. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇద్దరూ కూడా గోదావరి జలాలను ఏపీకి ధారాదత్తం చేసి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి? సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి? టెలీమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు.. కానీ, సీఎం దాన్ని తమ విజయంగా చెబుతున్నారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్‌, భాజపా దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచర్లను తక్షణమే ఆపాలి.. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.

Read More
Next Story