ఎమ్మెల్యేలకు కవిత నోటీసులు..
x

ఎమ్మెల్యేలకు కవిత నోటీసులు..

క్షమాపణలు చెప్పడానికి వారం రోజుల డెడ్‌లైన్ పెట్టిన జాగృతి అధ్యక్సురాలు కవిత.


తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణకు సదరు నేతలు కూడా అంతే స్ట్రాంగ్‌గా కంటర్లు ఇస్తున్నారు. కాగా ఇటీవల కవిత, కొందరి నేతల మధ్య విమర్వలు మాటల యుద్ధంగా మారాయి. ఈ క్రమంలోనే కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు టీ న్యూస్ ఛానెల్‌కు లీగల్ నోటీసులు పంపారు. తనపై, తన భర్తపై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా వారు తమ తప్పు తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు కవిత. లేనిపక్షంలో తాను చట్టప్రకారం ముందుకు వెళ్తానని హెచ్చరించారు.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, కవిత ప్రస్తుతం “జనం బాట” పేరుతో విస్తృత పర్యటన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ పర్యటనను ఆమె నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించి, ప్రస్తుతం మేడ్చల్ మరియు హైదరాబాద్ జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. గురువారం రోజున మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా కవిత బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై పలువురి గురించి విమర్శలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన కూడా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలోనే కవిత నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Read More
Next Story