
కేటీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది: కవిత
హరీష్, కేటీఆర్ టార్గెట్‌గా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత. సీఎం రేవంత్‌కు హెచ్చరిక.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. మరోసారి కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్‌గిరి ప్రజల సమస్యలు తీర్చకుండా సీఎం రేవంత్‌ను చరిత్ర క్షమించదని అన్నారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మల్కాజ్‌గిరిని అభివద్ధి చేశానని కేటీఆర్ పదేపదే చెప్పుకున్నారని, కానీ ఆ డిఫ్యాక్టో సీఎం చేసిన అభివృద్ధి అక్కడకు వెళ్లి చూస్తే కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆరడుగుల బుల్లెట్ అని చెప్పుకునే హరీష్ రావు.. కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక్క హాస్పిటల్ కూడా ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు.
జాగృతి జనం బాటో భాగంగా కవిత.. సోమవారం కూకట్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న సమస్యలను ఎత్తిచూపారు. లక్ష్మాపూర్ సమస్యను ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకున్నా, ఇప్పటికీ ప్రజల ఇబ్బందులు తగ్గలేదని ఆమె మండిపడ్డారు.
కవిత వెల్లడించిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లాలో దాదాపు 32 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేకపోవడం, ప్రజల ఆరోగ్య హక్కులపై పెద్ద అన్యాయం అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కీసర, ఉప్పల్ నుండి గాంధీ ఆస్పత్రి వరకూ వెళ్ళాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, శామిర్‌పేట్‌లో కలెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఆమె చెప్పారు. జవహర్ నగర్ పేదల పట్ల ప్రభుత్వం అన్యాయం చేసిందని, చెత్త కుప్ప మధ్యలో ఇళ్లు ఇచ్చి, ఎస్టీపీ నిర్వహణ భారాన్ని వారి మీద వేసిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవని, రోడ్లు దారుణంగా ఉన్నాయని, బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయని, విద్య పూర్తిగా ప్రైవేట్ పరం అయిందని, కవిత ఆరోపించారు.
చెరువులపై కబ్జాలు అత్యధికంగా జరుగుతున్నాయని, కుత్బుల్లాపూర్‌ను ప్రజలు ‘కబ్జాలపూర్’ అని పిలుస్తున్న స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆమె అన్నారు. బండ్ల చెరువు, పరికి చెరువులపై భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో మొత్తం బీటీ బ్యాచ్ నేతలు గెలిచారని, వారు కేవలం కబ్జాలు, కాంట్రాక్టులు, పవర్ కోసం మాత్రమే ఉన్నారని, ప్రజల సమస్యలపై దృష్టి లేదని కవిత విమర్శించారు.
ఉప్పల్ ఫ్లైఓవర్, నేరెడ్‌మెట్ రైల్వే ఫ్లైఓవర్ వంటి కీలక ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. లింగం చెరువులో మల్లారెడ్డి హాస్పిటల్ వ్యర్థాలు పడుతున్నాయని, పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి ప్రాంతానికి గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ సమస్యలు తెలిసే ఉన్నాయని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని కవిత పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే “చరిత్ర క్షమించదు” అని హెచ్చరించారు.
ఎంపీ ఈటల రాజేందర్ పై కూడా ప్రజలు స్పందన రాలేదని ఫిర్యాదు చేస్తున్నారని, కేంద్రం నుంచి అంగీకరించాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. జాగృతి తరఫున ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కాలేజీలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

