‘కేటీఆర్‌ అరెస్ట్‌కు కవిత కుట్ర’
x

‘కేటీఆర్‌ అరెస్ట్‌కు కవిత కుట్ర’

ఇప్పటికే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని కవిత నాశనం చేశారన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. కవిత అవినీతి అంతా బయట పెడితే అంతే సంగతులని హెచ్చరించారు. ఈ సందర్బంగానే కేటీఆర్ అరెస్ట్‌కు కవిత కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే భయపడేవాడు ఎవడూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు వస్తుంటే భయపడ్డారని చెప్పుకుంటున్నావని, నీలాంటి కుక్కలు నా దగ్గరకు చాలా వచ్చినయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కవిత.. బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆ తర్వాత మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డిపై కూడా ఘాటు ఆరోపణలు చేశారు. తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీద కూడా సంచలన విమర్శలు చేశారు. దీంతో తాజాగా కవిత విమర్శలపై స్పందించిన కృష్ణారావు.. కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన అవినీతి బండారం అంతా బయటపెడతానని అన్నారు. తాను ఇంకా మాట్లాడితే కవిత తట్టుకోలేదని కూడా ఆయన అన్నారు.

కేసీఆర్ పరువు తీశావ్

‘‘నీలాంటి కుక్కలు మస్తు వచ్చినాయి నా దగ్గరికి.! నీ సంగతి నీ మొగుని సంగతి ఏందో తెలియదా..! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీమీద దృష్టిపెడితే మొత్తం బయటపడతాయి అక్రమాలు... అక్రమాలు సంపాదన గురించి నువ్వు మాట్లాడుతున్నావా..!’’ అని అన్నారు. ‘‘నిన్ను చూసి ఎవడు భయపడడు..! మహాత్మా గాంధీ లాంటి మంచి పేరు ఉన్న నీ తండ్రి పరువుతీసినవ్.. ఆయన ప్రతిష్టను నాశనం చేసినావ్..! నివళ్ళనే అంతా నష్టం..!’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘హైదరాబాద్ ను అభివృద్ధి పథంలో నడిపించిన కేటీఆర్ మీద విమర్శలు చేస్తావ్... హరీష్ రావు ను పార్టీ నుండి వెళ్లగొట్టి.. కేటీఆర్ నుండి పార్టీని లాక్కోవడానికి నువ్వు చేస్తున్న కుట్ర ఎవనికి తెలియదు అనుకుంటున్నావ్..! ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు..! ఈ మాటలన్నది ఎవరో కాదు’’ అని అన్నారాయన.

అసలు కవిత ప్లాన్ ఇదే..

కవిత ప్లాన్ అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడమేనని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ‘‘మంత్రి పదవులను కవిత ఎంతమందికి అమ్ముకున్నావో మాకు తెలియదా. హైదరాబాద్‌ను కేటీఆర్ అభివృద్ధి చేస్తే.. ఆయననే తిడుతున్నావ్. అసలు కవిత ప్లాన్ అంతా ఒకటే.. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలి. ఏదో కేసులో ఏదో ఒకటి చేసి, రేవంత్ సహాయంలో కేటీఆర్‌ను ఆరెస్ట్ చేయించాలి. అప్పుడు ఈమె నాయకత్వం తీసుకుని రాష్ట్రమంతా తిరిగి దోచుకు తినాలి. అందుకోసం కవిత ఏడాదిగా ప్లాన్ చేస్తున్నారు’’ అని మాధవరావు వ్యాఖ్యానించారు.

గెలిచింది ఒక్కసారే..

‘‘కవిత.. నువ్వు గెలిచింది ఒకే ఒక్కసారి. రెండోసారి ఓడిపోయావ్. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కానీ నువ్వు రెండో సారి గెలవడం చేతకాలేదు నీకు. ఉద్యమకారులపై అంత ప్రేమ ఉంటే.. ఎమ్మెల్సీ తీసుకోకుండా ఎవరైనా ఉద్యమకారులకు ఇవ్వాల్సింది కదా.. నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలే. గతంలో నేను టీడీపీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతల ప్రకారం పనిచేశా. నీలా అబద్ధాలు ఆడలేదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతిపరులు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవ్’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని నాశనం చేశావ్..

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని నావనం చేసింది కూడా కవితనే అని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఆమె చేసిన అవినీతి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉందని విమర్శించారు. కవితకు హైదరాబాద్‌లో అంత పెద్ద ఇల్లు కవితకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడంలో కవిత కీలకం అని అన్నారు.

Read More
Next Story