
నిరాహర దీక్ష కవిత రెడీ..
బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో మూడు రోజుల పాటు దీక్ష చేయనున్నారు కవిత. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమె ప్రకటించారు. ఆగస్టు 4, 5, 6 రోజుల్లో ఈ దీక్ష కొనసాగుతంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జాగృతి నేతలతో కలిసి కవిత విడుదల చేశారు. అందులో ‘బీసీ బిల్లు కోసం 72 గంటల నిరాహార దీక్ష’ అని రాసుంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించిన కవిత.. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసమే తాను దీక్ష చేస్తున్నట్లు కూడా కవిత తెలిపారు. మరి కవిత చేపట్టనున్న ఈ దీక్ష ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Next Story