
Kavitha|టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది
బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) జరిగిందని అంగీకరించారు.
టెలిఫోన్ ట్యాపింగ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) జరిగిందని అంగీకరించారు. కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ట్యాపింగ్ జరగటం చాలా బాధాకరమన్నారు. తమ దగ్గరిబందువుల ఫోన్లు కూడా ట్యాపయినట్లు తెలిపారు. పీఏలు, ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపయ్యాయని చెప్పారు. తమకు సిట్ అధికారుల నుండి సాక్ష్యులుగా విచారణకు రమ్మని సమాచారం అందినట్లు కొందరు తనతో చెప్పారని అన్నారు. తాను కూడా విచారణకు హాజరై ఏమి జరిగిందో చెప్పమని చెప్పినట్లు కవిత వివరించారు.
కేసీఆర్ హయాంలో ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన కవిత(Kavitha) తనతండ్రికి ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ భోళాశంకరుడని ఒకళ్ళకి ఇవ్వటమే కాని తీసుకోవటం తెలియదన్నరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ హయాలో ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన కవిత ట్యాపింగ్ ను కేసీఆర్ మాత్రం చేయించలేదని అంటున్నారు. కిందవాళ్ళు ఎవరైనా చేయించి ఉండచ్చని కూడా అన్నారు. అంటే అర్ధం ఏమిటి ? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన కవిత ఆ అంశంతో కేసీఆర్ కు మాత్రం సంబంధంలేదంటే ఎవరు చేయించినట్లు ?
కవిత పరోక్షంగా ఏమి చెప్పదలచుకున్నట్లు ? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ వ్యవహారాలు మొత్తాన్ని చూసుకున్నది కేటీఆర్(KTR) అన్న విషయం అందరికీ తెలుసు. పేరుకు మాత్రమే కేసీఆర్ సీఎంగా ఉండేవారు. రోజువారి వ్యవహారాలతో పాటు కీలక నిర్ణయాలు కూడా కేసీఆర్ తో చెప్పి కేటీఆరే తీసుకునే వారన్న ప్రచారం అప్పట్లో విపరీతంగా జరిగింది. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ కు తెలీకుండా కేటీఆరే చేయించారని కవిత చెప్పదలచుకున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వేలాది మొబైల్ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటేనే ప్రభుత్వ అధినేతకు తెలీకుండా జరిగే అవకావమేలేదు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమంతట తాముగా వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించే ఛాన్సేలేదు. ఏదేమైనా కేసీఆర్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత అంగీకరించటం ఇపుడు సంచలనంగా మారింది.