గ్రాండ్ గా కవిత రీ ఎంట్రీ
x
Kalvakuntla Kavitha

గ్రాండ్ గా కవిత రీ ఎంట్రీ

జనజీవన స్రవంతికి నెలల తరబడి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత రీఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ పెద్దఎత్తున చేస్తున్నట్లు సమాచారం


జనజీవన స్రవంతికి నెలల తరబడి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రీఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను బీఆర్ఎస్(BRS) పార్టీ పెద్దఎత్తున చేస్తున్నట్లు సమాచారం. పార్టీ పిలుపుమేరకు ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగబోతున్న దీక్షా దివస్ కార్యక్రమంలో కవిత పాల్గొంటారని పార్టీవర్గాల సమాచారం. అయితే ఏ నియోజకవర్గంలో ఆమె దీక్షలో పాల్గొనేది ఇంకా తెలీలేదు. అంతకుముందే అంటే 26వ తేదీన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావును కలుస్తారని సమాచారం. బీసీ కులగణన నేపధ్యంలో స్ధానికసంస్ధల్లో బీసీల రిజర్వేషన్ కోసం అపాయింట్ అయిన కమిషన్ ఛైర్మన్ ను కవిత కలవాలని అనుకోవటం ఇంట్రెస్టింగ్ పాయింటే. అభిప్రాయసేకరణ, రిజర్వేషన్ ఎంతుండాలనే విషయంలో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని ఛైర్మన్ ను కవిత కోరబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా కవిత చెలరేగిపోయిన విషయం అందరు చూసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో కవిత పాత్రపై చాలా ఆరోపణలు వచ్చాయి. స్కామ్ లో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు, సీబీఐ కవితపై కేసు నమోదుచేశారు. ఒకసారి ఢిల్లీలో విచారణ కూడా జరిగింది. తర్వాత విచారణకు రమ్మంటే కవిత వెళ్ళలేదు. విచారణకు వెళ్ళకపోగా దర్యాప్తు సంస్ధల నోటీసులను ఛాలెంజులు చేస్తు కోర్టులో కేసులు వేశారు. కేసు విచారణలో ఉండగానే ఈడీ అధికారులు 2023 మార్చి 15వ తేదీన హైదరాబాదుకు వచ్చి తనింట్లోనే కవితను అరెస్టుచేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. అప్పటినుండి 164 రోజులు ఢిల్లీలోని తీహర్ జైలు(Tihar Jail)లోనే ఉన్న కవిత చివరకు 2024, ఆగస్టు 27వ తేదీన బెయిల్ పై విడుదలయ్యారు. చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించి ఫెయిలైన కవిత చివరకు ఆగస్టులో సక్సెస్ అయ్యారు.

జైలు నుండి బెయిలుపై బయటకు వచ్చిన కవిత జనాల్లోకి రాలేదు. పదిరోజులు తాను ఎవరినీ కలిసేదిలేదని ట్విట్టర్లో ప్రకటించిన కవిత మూడునెలలైనా ఎవరినీ కలవలేదు. వివిధ కారణాలతో ఇంటికే పరిమితమైపోయిన ఆమె ఇంతకాలానికి మళ్ళీ జనాల్లోకి రావాలని డిసైడయ్యారు. తన ఎంట్రీ విషయంతో పాటు రెగ్యులర్ గా జనాల్లో ఉండేందుకు తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ తదితరాలు నిర్ణయించేందుకు శుక్రవారం భారత జాగృతి ముఖ్యనేతలతో కవిత తనింట్లోనే భేటీ అవ్వాలని డిసౌడ్ అయ్యారు. మరి ఆ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారో చూడాలి. తన ఎంట్రీని జనాలకు తెలియజేయటానికా అన్నట్లుగా గురువారం గౌతమ్ అదాని మీద అమెరికాలో కేసులు నమోదవ్వటం, అరెస్టు వారెంట్ జారీ అవ్వటం పై ట్విట్టర్లో పెద్ద పోస్టు పెట్టారు. మరి తన రీఎంట్రీ ఎలాగ ఉండబోతోందో చూడాలి.

Read More
Next Story