కిషన్ గురించి భార్య ఏమన్నదో తెలుసా ?
x

కిషన్ గురించి భార్య ఏమన్నదో తెలుసా ?

ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుందనే నానుడి ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు చాలా సందర్భాల్లో నిజంచేశారు.


ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుందనే నానుడి ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు చాలా సందర్భాల్లో నిజంచేశారు. ఇపుడు విషయం ఏమిటంటే కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న గంగాపురం కిషన్ రెడ్డి గురించి ఆయన భార్య ఢిల్లీలో గొప్పగా చెప్పింది. ఏ విషయంలో అంటే ఏ శాఖ ఇచ్చినా కిషన్ రెడ్డి సమర్ధవంతంగా నిర్వహించగలరని.

నరేంద్రమోడి 3.0 ప్రభుత్వంలో కిషన్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య కావ్యారెడ్డి మీడియాతో మాట్లాడుతు ఏ శాఖ కేటాయించిన ఇబ్బందిలేదన్నారు. పలానా శాఖే కావాలని కిషన్ కు పట్టింపు గాని కోరికకాని లేదన్నారు. ఇచ్చిన శాఖకు తగిన న్యాయంచేయటం, సమర్ధవంతంగా నిర్వహించటమే కిషన్ కు ముఖ్యమని చెప్పారు. గడచిన ఐదేళ్ళుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాని శాఖాపరంగా కాని కిషన్ చేసిన సేవలకు మెచ్చే జనాలు రెండోసారి ఎంపీగా గెలిపించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే హోంశాఖ సహాయమంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ సేవలను గుర్తించిన నరేంద్రమోడి మళ్ళీ మంత్రిగా తీసుకోబోతున్నట్లు కావ్య అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో కిషన్ తరపున తాను ప్రచారం చేస్తున్నపుడే తన భర్త గెలుపు ఖాయమని తనకు అర్ధమైపోయిందన్నారు. ప్రచారానికి వెళ్ళినపుడు జనాలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆధరించినట్లు చెప్పారు. ప్రచారానికి రావాల్సిన అవసరంలేదని తనతో చాలామంది మహిళలు చెప్పిన విషయాన్ని కావ్య గుర్తుచేసుకున్నారు. జనాలు ముఖ్యంగా మహిళల ఆధరణ, అభిమానం చూసిన తర్వాత కిషన్ గెలుపు ఖాయమని తాను బలంగా నమ్మినట్లు కావ్య చెప్పారు. పార్టీ పరంగానే కాకుండా శాఖాపరంగా కూడా కిషన్ ఎంతో కష్టపడతారని కావ్య కితాబిచ్చారు.

Read More
Next Story