కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం.. వాహనాలు ధ్వంసం
x

కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం.. వాహనాలు ధ్వంసం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగింది.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. ఘటనలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బుధవారం నుండి బస్సు యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా మధ్యాహ్నం తెలంగాణ భావం నుంచి యాత్ర ప్రారంభించి, నల్గొండ జిల్లా నుండి మిర్యాలగూడకి వెళ్తున్నారు. మిర్యాలగూడలో 5:30 గంటలకే నిర్వహించాల్సి ఉంది. కానీ, అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో అనుకున్న సమయం కంటే రోడ్ షో ఆలస్యంగా ప్రారంభం కానుంది.

అయితే నల్గొండ జిల్లా నుండి మిర్యాలగూడ వెళ్తుండగా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఒక వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో దాని వెనక ఉన్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. కొన్ని కార్లు పూర్తిగా ధ్వంసం అవడంతో వాటిని అక్కడే విడిచిపెట్టి యాత్ర కొనసాగిస్తున్నారు.


కాగా, ఈరోజు నుండి మే 7 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. మే 13 న లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బస్సు యాత్ర లో భాగంగా... సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్ షోకి మరో రోడ్ షోకి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంటుంది.

Read More
Next Story