చండీయాగం చేస్తున్న కేసీఆర్ దంపతులు
x
KCR couple

చండీయాగం చేస్తున్న కేసీఆర్ దంపతులు

గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫాంహౌస్ లో కొద్దిసేపటిక్రితం వేదపండితుల ఆశీర్వాదంతో నవగ్రహ యాగం, చండీయాగం మొదలుపెట్టారు.


కేసీఆర్ మళ్ళీ యాగాలు మొదలుపెట్టారు. తనను కష్టాలు చుట్టుముట్టినా, లేకపోతే కష్టాల్లో నుండి బయటపడాలన్నా కేసీఆర్ వెంటనే యాగాలు, పూజలు మొదలుపెట్టేస్తారని అందరికీ తెలిసిందే. ఇపుడు కూడా అదేపద్దతిలో తన సతీమణి శోభతో కలిసి రెండు యాగాలు మొదలుపెట్టేశారు. గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫాంహౌస్ లో కొద్దిసేపటిక్రితం వేదపండితుల ఆశీర్వాదంతో నవగ్రహ యాగం, చండీయాగం మొదలుపెట్టారు. ముందు నవగ్రహ యాగాన్ని ఎందుకు మొదలుపెట్టారంటే తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవ్వాలంటే ముందు నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. అందుకనే ఇళ్ళల్లో కూడా పెద్ద కార్యక్రమం తలపెట్టేటపుడు నవగ్రహ పూజలు చేయిస్తారు.

ఇదే పద్దతిలో ఫాంహౌస్ లో ముందుగా నవగ్రహ యాగం చేసిన తర్వాత చండీయాగం చేస్తారని సమాచారం. వాస్తు, పూజలు, యాగాలపైన కేసీఆర్ కు అపారమైన నమ్మకం ఉందని అందరికీ తెలిసిందే. పని చిన్నదైనా పెద్దదైనా సరే ముందుగా పూజలు చేయించనిదే కేసీఆర్ ఏ పనీ మొదలుపెట్టరు. అలాంటి కేసీఆర్ను ఇపుడు కష్టాలు నలువైపులా కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో మొదలైన ఎదురుదెబ్బల పరంపర ఇంకా కంటిన్యు అవుతునే ఉన్నాయి. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం. తర్వాత బాత్ రూములో కాలుజారి తుంటిఎముక విరగటం, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం అందరికీ తెలిసిందే.

ఇదిమాత్రమే కాకుండా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న అనేక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరగతోడుతోంది. విద్యుత్ రంగంలో భారీ అవకతవకలు జరిగియాన్న ఆరోపణలపై మదన్ బీ లోకూర్ కమిషన్ తో విచారణ చేయిస్తోంది. అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ తదితర ప్రాజెక్టుల నాసిరకం నిర్మాణాలు, అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్నది. ఇవంతా సరిపోవన్నట్లుగా కొడుకు కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫాం హౌసును కూల్చేయటానికి హైడ్రా రెడీగా కాచుక్కూర్చున్నది. ఏ రోజు ఫాంహౌసును హైడ్రా కూల్చేస్తుందో చెప్పలేకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కూతురు కవిత అతికష్టం మీద ఐదున్నర నెలల తర్వాత తీహార్ జైలు నుండి బెయిల్ పై బటయకు వచ్చారు. బెయిల్ ఎప్పుడు రద్దవుతుందో మళ్ళీ జైలుకు ఎప్పుడు వెళ్ళాలో తెలీని అయోమయంలో కూతురుంది. పరిస్ధితులను సమీక్షించుకున్న కేసీఆర్ తమ కష్టాలు తొలగిపోయి, మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే దైవంబలం చాలా అవసరమని గ్రహించినట్లున్నారు. అందుకనే వేదపండితులను సంప్రదించి ఫాంహౌస్ లో నవగ్రహ, చండీయాగాలను మొదలుపెట్టేశారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

Read More
Next Story