‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం ఓ బూటకం’
x

‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం ఓ బూటకం’

ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఉద్యమంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ నాటకాలు చేశారని ఆరోపించారు. అసలు ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదని, అసలు కేసీఆర్ చేసిన దీక్షతో తెలంగాణకు ఏం వచ్చింది? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో’ అన్నట్లు ఆయన ఉద్యమం ఏమీ చేయలేదని అన్నారు. ఎనిమిది రోజుల పాటు కూడా దీక్ష పేరుతో కేసీఆర్ ద్రవపదార్థాలు తీసుకున్నారని అన్నారు. ఆ సమయంలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్‌లు కావాలంటే కేటీఆర్‌కు పంపుతామని వ్యాఖ్యానించారు.

పోరాడింది విద్యార్థులు..

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షను విరమించుకుంటే పోరాటాన్ని విద్యార్థులు ముందుకు నడిపించారని అన్నారు. ‘‘విద్యార్థుల ఆవేదన చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదా? ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఐరోమ్ షర్మిల 16 సంవత్సరాలు దీక్ష చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికి కోసమే బీఆర్ఎస్.. కోట్ల రూపాయలతో దీక్ష దివాస్ చేస్తోంది’’ అని మహేష్ కుమార్ ఆరోపించారు.

సెంటిమెంట్ రగల్చడానికి మళ్లీ నాటకం

‘‘అప్పట్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నానని చెప్పి కేసీఆర్ నాటకం ఆడారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్‌ను రగల్చడం కోసం మళ్లీ నాటకం ఆడుతున్నారు. దిక్షా దివాస్‌ను పక్కనబెట్టి సోనియా గాంధీకి పాలాభిషేకాలు చేయాలి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అని కేసీఆర్‌కు అర్థమయింది. అందుకే బయటకు కూడా రావట్లేదు’’ అని చురకలంటించారు.

Read More
Next Story