
ఆపరేషన్ కగార్ నిలిపేయాలని మోడీని డిమాండ్ చేసిన కేసీఆర్
‘ఆపరేషన్ కగార్’ నిలిపేయాలని నరేంద్రమోడి(Narendra Modi) పేరెత్తకుండా కేంద్రాన్ని డిమాండ్ చేశారు
మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో ఆదివారం రాత్రి జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్(KCR) మాట్లాడుతు వెంటనే ‘ఆపరేషన్ కగార్’ నిలిపేయాలని నరేంద్రమోడి(Narendra Modi) పేరెత్తకుండా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సభకు హాజరైన జనాల ఆమోదాన్నే పార్టీతీర్మానంగా(BRS operation kagar resuolution) కేంద్రానికి పంపుతున్నట్లు చెప్పారు. బలముందికదాని మావోయిస్టులను ఏరేస్తామని ఎన్ కౌంటర్లు చేయటం మంచిదికాదని హితవుపలికారు. ఆపరేషన్ కగార్ ను నిలిపేసి మావోయిస్టులను చర్చలకు పిలవాలన్నారు. శాంతిచర్చలకు మావోయిస్టులు(Maoists) పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను కేసీఆర్ గుర్తుచేశారు. శాంతిచర్చలకు పిలవమని విజ్ఞప్తిచేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపటంలో తప్పులేదని చెప్పారు. శాంతిచర్చలకు పిలిచి వాళ్ళేంచెబుతారో వినాలని, అలాగే మావోయిస్టులు ఏమంటారో దేశం మొత్తాన్ని విననీయండని కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.
ఇంత సడెన్ గా, అసందర్భంగా ఆపరేషన్ కగార్ గురించి కేసీఆర్ ఎందుకు ప్రస్తావించారో అర్ధంకావటంలేదు. నిజానికి ఆపరేషన్ కగార్ కు కేసీఆర్ కు ఎలాంటి సంబంధంలేదు. మావోయిస్టులను ఏరివేయాలన్నది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సమావేశమై తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ కగార్. ఇపుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నకారణంగా ఆపరేషన్ కగార్ తో ఎలాంటి సంబంధంలేదు. బహిరంగసభ వేదిక నుండి కేసీఆర్ చేసిన డిమాండ్ మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడినట్లయ్యింది. ఇంతహఠాత్తుగా మావోయిస్టు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్ కు ఏమొచ్చిందన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.