
కెసీఆర్ యశోదా నుంచి డిశ్చార్జ్
పరీక్షలు పూర్తికావడంతో నేరుగా కొడుకు ఇంటికి
మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. గురువారం కెసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం యశోదాఆస్ప్రత్రిలో చేరారు.సాయంత్రం అన్ని పరీక్షలు పూర్తవడంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు శరీరంలో బ్లడ్ షుగర్, సోడియం నిల్వలు అసాధరణంగా పెరిగిపోవడంతో కెసీఆర్ ఈ నెల 3న ఫామ్ హౌజ్ నుంచి కొడుకు నివాసముండే నందినగర్ కు చేరుకున్నారు. అక్కడ్నుంచి యశోదా ఆస్పత్రికి చేరుకుని వైద్య పరీక్షలు చేసుకున్నారు. అబ్జర్వేషన్ లో వారం రోజులు ఇక్కడే ఉండాలని వైద్యులు సూచించారు. కానీ కెసీఆర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నారు. అవసరమైతే తాను మళ్లీ వస్తానని చెప్పి ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. కెసీఆర్ బ్లడ్ షుగర్ , సోడియం నిల్వలు అసాధరణంగా పెరిగిపోవడంతో మరో మారు కెసీఆర్ యశోద చేరుకుని పరీక్షలు చేసుకుని గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. యశోదా నుంచి నేరుగా కొడుకు నివాసమున్న నందినగర్ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు.