ఆస్పత్రి నుంచి కెసీఆర్ డిశ్చార్జ్
x

ఆస్పత్రి నుంచి కెసీఆర్ డిశ్చార్జ్

కొడుకు నివాసమున్న నందినగర్ కు..


మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కెసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బీపీ,సోడియం, షుగర్ నిల్వలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కొద్దిసేపటి క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఫామ్ హౌజ్ నుంచి నేరుగా యశోదా ఆస్పత్రికి కెసీఆర్ చేరడంతో బిఆర్ఎస్ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. కుటుంబ సభ్యులు కెసీఆర్ వెంటే ఉన్నారు. కూతురు కవిత ఒక రోజు ఆలస్యంగా ఆస్పత్రికి చేరుకుని కెసీఆర్ ను పరామర్శించారు. జనరల్ చెకప్ కోసం కెసీఆర్ యశోదాలో చేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న కెసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే సమయంలో కవిత కెసీఆర్ వెంటే ఉన్నారు. నిన్న బిఆర్ఎస్ నేతలతో కెసీఆర్ చిట్ చాట్ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కెసీఆర్ కొడుకు నివాసముండే బంజారాహిల్స్ నందినగర్ కు చేరుకున్నారు.

Read More
Next Story