కెసిఆర్ ఇలా అంటున్నారు, ఎంపిలు అలా వెళ్లిపోతున్నారు
x
ఆయన పిడికిలి బిగించినా, లీడర్లెవరూ వెళ్లిపోకుండా ఆపలేకపోతున్నారు.

కెసిఆర్ ఇలా అంటున్నారు, ఎంపిలు అలా వెళ్లిపోతున్నారు

ఎంజరుగుతున్నది భారత రాష్ట్ర సమితిలో. లోక్ సభ ఎన్నికల్లో గౌరవ ప్రదమయినన్ని సీట్లు రాకపోతే, బిఆర్ ఎస్ కర్నాటకలో దేవేగౌడ్ నాయకత్వంలోని జెడిఎస్ లాగా అవుతుందా?


ఈ లోక్ సభ ఎన్నికలు బిఆర్ ఎస్ , బిజెపి మధ్యే అని కెసిఆర్ అంటున్నారు. కాంగ్రెస్ వస్తూనే భూగర్బ జలాలు ఎండిపోయాయి, బోర్లు పడటం లేదు, కరువులొస్తున్నాయి. ఇక ప్రజలు రోడ్డెక్కుతారని అంటున్నారు. అంతేకాదు, ఇక బస్ యాత్ర చేస్తానని కూడా చెబుతున్నారు.. కరీంనగర్ లో సెంటిమెంట్ జాగా లో మీటింగ్ పెడ్తానని హెచ్చరిస్తున్నారు.


అయినా సరే, ఎవరూ వినడం లేదు. ఒక్కొక్కరే వెళ్లి పోతున్నారు.


నఇప్పటికే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్‌ఎ్‌సను బిజెపిలో చేరిపోయారు.కుదుట పడ్డారు. ఒకట్రెండ్రోజుల్లో మరో ముగ్గురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం జరుగుతూ ఉంది.


వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూ రి రమేశ్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓడిపో యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వరంగల్‌ (ఎస్సీ రిజర్వుడు) స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. దీనికోసం చేసేందుకు రమేష్‌ ప్రయత్నాలు చేశారు. అయితే స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్డొస్తున్నారు. ఈ మధ్య శ్రీహరి కాంగ్రెస్ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించి కెసిఆర్ కంటపడుతున్నారు. దీనికి కారణం ఆయన తన కుమార్తె కడియం కావ్యను బరిలో దించేందుకే చాలా మంది అనుమానం. కాంగ్రెస్ మీద ఆయన విరుచుకుపోడటం వెనక ఈ వ్యూహం ఉందని చెబుతున్నారు.

ఇక వరంగల్ నగర మేయర్‌ గుండు సుధారాణి కూడా బిఆర్ ఎస్ కు గుడ్ బై చెబుతారని పేరు. సుధారాణి బిసి వర్గానికి చెందిన లీడర్. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. తాను అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు సుధారాణి చెబుతున్నప్పటికీ చాలామంది కార్పొరేటర్లతో కలసి ఆమె కూడా హస్తం గూటికి వెళ్తారని టాక్.

ఇలా అదను చూసి వెళ్లి పోవాలనుకుంటున్న చిన్న పెద్ద లీడర్లెందరో ఉన్నారని రోజూ వార్తలొస్తున్నాయి.

మొత్తానికి ఈ వార్తలన్నీ ఏమి చెబుతున్నాయి. కెసిఆర్ నాయకత్వం మీద, బిఆర్ ఎస్ భవిష్యత్తుల మీద, లోక్ సభ ఎన్నికల్లోబిఆర్ ఎస్ పునరాగమం మీద పార్టీ సర్వత్రా అనుమానాలున్నాయనే కదా.

ఎమిటీ పరిస్థితి?


2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఎలా ఉండింది. టికెట్‌ కోసంఎంత పోటీ ఉండేది. ఇప్పుడు మాత్రం టికెట్‌ ఇస్తారేమో లని సిటింగ్ లు భయపడుతున్నారు,. పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని సీనియర్లు కావాలనే మీడియాలకు లీకు ఇస్తున్నారు.

ఈ సారి లోక్‌సభ ఎన్నికలను పార్టీలన్నీ సీరియ్‌సగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీ తన విజయం పొంగు కాదు, నిజమయిన విజయం అని నిరూపించుకోవాలనుకుంటున్నది. లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ విజయానికి తగ్గట్లు లోక్ సభ సీట్లు తెచ్చుకోవలసిన అవసరం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చాలా అవసరం. అందుకే ఆ పార్టీ చాలా వ్యూహాలతో ముందుకు పోతున్నది. క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరిగింది.లీడర్లు కూడా అన్నింటికి తెగించేస్తున్నారు.

ఇక బిజెపి కి ఈ లోక్ సభ ఎన్నికలుచాలా విధాలుగా అవసరం. ఎందుకుంటే, దక్షిణాది నుంచి పార్టీకి కొన్ని ఎంపిసీట్లయిన అందించాలి. దీనికి కర్నాటక తర్వాత మిగిలింది తెలంగాణే. గతంలో బిజెపి నలుగురు ఎంపిలున్నారు. దీనిని డబుల్ డిజిట్ తీసుకువెళ్లేందుకు పార్టీ యోచిస్తున్నది. వాతావరణం కూడా బిజెపికి అనుకూలంగా ఉంది. పార్టీలోకి చాలా మంది డబ్బున్నోళ్లు వచ్చి చేరుతున్నారు. బిఆర్ ఎస్ ఎంపిలు చేరారు.మాజీలు చేరుతున్నారు. ఈ వలసలు చూసే బిజెపికి ధైర్యం వచ్చింది. మొత్తానికి తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోటీ కాంగ్రెస్, బిజెపి ల మధ్య ఉంటుందని అంతా గుర్తించారు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఆయన మాత్రమే ఈ సార పోటీ బిజెపి, బిఆర్ ఎస్ మధ్యే ఉంటుందని నవ్వించే ప్రయత్నం చేశారు.

బిజెపికి అనుకూలంతా ఉన్న విషయాలు.

మోదీ-3.0 నినాదం. ఇది చాలా శక్తి వంతమయిన నినాదం. రామాలయం నిర్మాణం. కేంద్రంలో ప్రతిపక్షాలు లేగనే పోవడం, రాష్ట్రాన్ని కేంద్రం నుంచి ఎలా నిధులొస్తున్నాయో చూపే ప్రయత్నం. ఇవి తెలంగాణలో పనిచేస్తాయో లేదో గాని, వీటిని నమ్ముకుని పార్టీ ముందుకు పోతున్నది. ఒక ధీమా బిజెపిలో కనిపిస్తుంది. అదేంటంటే, ఒక వేళ తెలంగాణలో బిజెపికి ఎక్కువ సీట్లు రాకపోయినా, కేంద్రంలో వచ్చేది బిజెపియే కదా.అపుడు చాలా మంది నేతలకు ఏవో కొన్ని పదవులు లభిస్తాయి. కాంట్రాక్టులు వస్తాయి. ఈ కారణాలలో చాలా మంది బిజెపి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది.


లోక్ సభ ఎన్నికల తర్వాత...


లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ గౌరవ ప్రదమయిన స్థానాలుపొందలేకపోతే, కెసిఆర్ పరిస్థితి కర్నాటక దేవేగౌడ పరిస్థితిలాగా, బిఆర్ ఎస్ ది బిఆర్ ఎస్ ది జనతాదళ్ సెక్యులర్ పరిస్థితి అయ్యేలా ఉంది. అపుడు వలస వెల్లవను ఎవ్వరూ ఆపలేరు. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి తెలంగాణ ఆధిక్యత వస్తుందో అటువైపు వేల సంఖ్యలో బిఆర్ఎస్ నేతలు దూకుతారు. లోక్ పభ ఎన్నికల్లో పది న్నెండ్ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ అందరికి కంటే బాగా ఆకర్షణయంగా కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో బిఆర్ ఎస్ గెలిచాక లీడర్లంతా ఎలా రాష్ట్రభివృద్ధి కోసమే బిఆర్ ఎస్ లో చేరుతున్నామని చెప్పి కెసిఆర్ గూటికి చేరారో అలాగే కాంగ్రెస్ ఇల్లు కిటకిటలాడుతుంది.

పదేళ్ల పాలనలో లీడర్లెవరూ కెసిఆర్ మీద గౌరవంతోనే, ఈ పరిపాలన మహాద్బుతంగా సాగుతన్నదనో రాలేదు. ఆయనకూడా వాళ్లను తెలంగాణ యోధులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదు. దీని ప్రభావం ఇపుడు సర్వత్రా కనబడుతూఉంది. ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో, అలాగే పోతున్నారు.

.


Read More
Next Story