ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
x

ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ

రాష్ట్రంలో పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల విషయంలో పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


మాజీ సీఎం కేసీఆర్.. శుక్రవారం పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. ఇందులో పార్టీ నేతలకు కేసీఆర్ కీక ఆదేశాలు ఇచ్చారు. దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల విషయంలో పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగానే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలపై గళమెత్తాలి? రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎలా పాల్గొనాలి? ఏ విషయాలపై దృష్టి సారించాలి? వంటి అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అదే విధంగా ప్రతి నేత నుంచి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆదేశించారు. అనంతరం అతిత్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ విజయం సాధించాలని చెప్పారు.

Read More
Next Story