‘SLBC ప్రమాదానికి కేసీఆరే కారణం’
x

‘SLBC ప్రమాదానికి కేసీఆరే కారణం’

కమిషన్లకు కక్కుర్తి పడే ప్రాజెక్ట్‌ను పక్కనబెట్టారన్న సీఎం. తీవ్ర దుమారం రేపుతున్న రేవంత్ వ్యాఖ్యాలు.


శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదానికి మాజీ సీఎం కేసీఆరే కారణమంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ పైకప్పు ఈనెల 22న కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు లోపల చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి ఐదు రోజుల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ సహా పలు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. కానీ ఇప్పటికీ వారి ఆచూకి తెలియలేదు. ఈ క్రమంలో ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కమిషన్లకు కక్కుర్తి పడే కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు.

‘‘ప్రమాదం జరిగిన మూడు రోజుల వరకు దీనిపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు. కమిషన్ల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను మూలనబెట్టారు. కానీ మా ప్రభుత్వవం అలా కాదు. పేదలను తక్కువ ఖర్చుతో నీరు అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా దీనిని పూర్తి చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రేవంత్‌కు ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలతో పోరాడుతున్నారన్న విషయం గుర్తు కూడా లేదని, వారి గురించి కానీ, వారి కోసం చేస్తున్న సహాయక చర్యల గురించి కానీ మాట్లాడుకుండా.. కేసీఆర్‌పై ఆరోపణలపైనే ఫోకస్ పెడుతున్నారన్న చర్చ జోరందుకుంటుంది.

రేవంత్‌కు ప్రజల కన్నా అధికారం, రాజకీయమే ముఖ్యం అన్న వాదన బలం పుంజుకుంటుంది. ప్రమాదంలో ఇరుక్కున్న వారి కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించలేదు? ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి సమయం ఉంది కానీ.. వారి ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తూ ప్రమాదవశాత్తు లోపల చిక్కుకుపోయిన వారి కుటుంబాలను పరామర్శించే సమయం సీఎంకు లేదా? అన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం.. సీఎం రేవంత్ ఒరిజినాలిటీ బయట పడిందని, బురద రాజకీయాలు చేయడం ఉన్న శ్రద్ధ.. ఎస్‌ఎల్‌బీసీ వారి పరిస్థితి ఎలా ఉంది? వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? అన్న అంశాలపై లేదంటూ బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.

తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్‌లు అవ్వాలనే సీఎం ఆలోచిస్తున్నారు కానీ.. వాటి నాణ్యత ప్రమామాణాల గురించి ఆయనకు పట్టదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మరి ఈ ప్రశ్నలపై సీఎం రేవంత్ కానీ, కాంగ్రెస్ వర్గాలు కానీ ఏమైనా స్పష్టత ఇస్తాయేమో చూడాలి.

సహాయక చర్యలపై ఉత్తమ్ ఏమన్నారంటే..

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో జరుగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్‌డేట్ ఇచ్చారు. టన్నెల్ బోర్ మిషన్ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు అడ్డుగా ఉన్న బురదనీటిని తొలగించే చర్యలు ముమ్మరం చేశామని, ఆధునిక పరిజ్ఞానంతో రెస్క్యూ ఆపరేషన్స్‌పై దృష్టి సారించామని వెల్లడించారు. ‘‘నేవి, ఆర్మీ, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, రాబిన్ తదితరులతో సమీక్ష నిర్వహించాం. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్వేషణను ముమ్మరం చేసింది’’ అని చెప్పారు.

‘‘అందుకు తగిన ప్రణాళికలు రూపండించుకున్న రిస్క్యూ టీం లు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద నీటిని తొలగించే ప్రక్రియను మరింత స్పీడ్ పెంచాము. ఆధునిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించాయి. సహాయక చర్యల్లో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీం లకు వెసులుబాటు కలిపించింది. ముందుకు పోయేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం. సహాయక చర్యలను మరింత ముమ్మరంగా సాగేలా రెస్క్యూ టీంలకు నిర్దేశించాం. టన్నెల్ లోపల జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగుతుంది’’ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read More
Next Story