Mahesh Kumar Goud
x

కేసీఆర్ తెలంగాణ హీరో కాదా.. విలనా..!

దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని.. నకిలీ గాంధీలు అనడం కేసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట. కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఆ పార్టీ నేతలు హీరో అని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర పితామహుడు అయ్యారంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని గొప్ప యోధుడు, తెలంగాణే ఆయన ధ్యాస, శ్వాస అని చెప్తారు. మరోమాటలో చెప్పాలంటే తెలంగాణ హీరో కేసీఆర్ అని అంటారు. కానీ తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేసీఆర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అని అన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ హీరో కాదు విలన్ అని వ్యాఖ్యానించారు.

‘‘పదేళ్ల బిఆర్ఎస్ పాలన..15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దం..! టైం వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసిఆర్? రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయి. సభలో అసలు మహిళలే కనిపించలే. వరంగల్ సభ లో కేసిఆర్ ప్రసంగంలో పసలేదు..ఆయన శకం ముగిసింది. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని.. నకిలీ గాంధీలు అనడం కేసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట. కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని హెచ్చరించారు.

‘‘బీజేపీ - బిఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీ పై కేసిఆర్ రెండు నిమిషాల ప్రసంగం. బీజేపీ పై కేసిఆర్ విమర్శలు నెమలి పిచ్చంతో కొట్టినట్లు ఉంది. బీసీ కుల గణన ,ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసిఆర్ ఎందుకు నోరు మెదపలేదు. బిజెపి బీఆర్ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం. కాంగ్రెస్ బిక్షతో ముఖ్యమంత్రి అయ్యావు కేసిఆర్. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. పదేళ్లలో మీరు 60 వేల ఉద్యోగాలు ఇస్తే..మేము ఏడాదిలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’’ అని గుర్తు చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసిఆర్ కి గుండెల్లో గుబులు మొదలైంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్క లాటతో కేసిఆర్ కి మతి భ్రమించింది. కుటుంబ కొట్లాట వేగలేక రజతోత్సవ సభ పేరిట కేసిఆర్ హంగామా చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. వేదికపై అయ్య కేసిఆర్, కొడుకు కేటీఆర్ ఫ్లెక్సీ తో అల్లుడు హరీష్, కూతురు కవిత మనసుకి మరోసారి గాయమైంది. చిలక ఏ తోడు లేక అంటూ కవిత..బబ్రజమానం భజగోవిందంలా హరీష్ రావు పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసిఆర్ ను క్షమించారు. కెసిఆర్ ప్రసంగంతో బిజెపి బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైంది’’ అని అన్నారు.

‘‘పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసిఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన, ఎస్సీ వర్గీకరణ,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సన్న బియ్యం పంపిణీనీ అమలు చేస్తున్నాం. కేసిఆర్ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంస పాలైంది. పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడు కన్నతల్లిని జన్మభూమిని మించిన స్వర్గం లేదనే మాట కేసీఆర్ కి గుర్తుకు రాలేదా. తెలంగాణ సెంటి మెంటు ను వాడుకోవడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన కేసిఆర్ కు జన్మభూమి పేరిట తెలంగాణ పేరు పలకడం విడ్డూరం. ఉద్యమ జెండాను దింపితే రాళ్లతో కొట్టి చంపండి అన్న కేసిఆర్ కు పదేళ్లలో అమరవీరులు త్యాగం, ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రాలేదు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయిలో రాష్ట్రంలో అస్తిత్వం కోల్పోయిన కేసీఆర్ అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకొని బీజేపీ కి సాగిలపడి రాష్టానికి తీవ్ర అన్యాయాలు చేశారు. కేసీఆర్ పది ఏళ్లలో చేయాలనేది కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపింది. పదేళ్ల పాలనలో దళిత సీఎం..ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా? భూముల ధరలు పెంచి మీ కుటుంబం బాగు పడింది. Brs పోతే దరిద్రం పోయిందని ప్రజలు ఆనందం గా ఉన్నారు. లాభాల్లో ఉన్న తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన కేసిఆర్ ను ప్రజలు క్షమించరు. రైతు బంధు పేరుతో దళారులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు భూములు కేసిఆర్ అండ్ కో అప్పనంగా దోచి పెట్టారు. తెలంగాణలో ఆర్ధిక విధ్వంసం సృష్టించి పలాయనం చిత్తగించిన కేసిఆర్ మాటల్ని ఖండిస్తున్నా’’ అని స్పష్టం చేశారు.

‘‘గాంధీ కుటుంబం మీద విమర్శించే స్తాయి కేసిఆర్ కి లేదు. దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుంటుబం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావ్.. మోసం. దళిత సీఎం చేస్తా అన్నావ్ ..ద్రోహం.. ఆదివాసులకు, ముస్లింలు లకు రిజర్వేషన్లు ఇస్తా అన్నావ్.. మోసం. బిఆర్ఎస్ పార్టివి 420 హామీలు ఇచ్చింది. కాళేశ్వరం కుళేశ్వరం ప్రాజెక్టు గా మిగిలిపోలేదా.. ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమా. గజ్జె కట్టిన గద్దర్ ను అవమానించిన చరిత్ర కేసిఆర్ ది’’ అని ఎద్దేవీ చేశారు.

‘‘మహాకవి రాసిన గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించాం. ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు కేసిఆర్. డబుల్ బెడ్రూ ఇళ్ల పేరుతో ఘరానా మోసం చేశారు. బిఆర్‌ఎస్ హయంలో ఎన్ని ఉద్యోగాల ఇచ్చారు. మహిళలు మీ మీటింగ్ ఎందుకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారు. విద్య వ్యవస్థ ను కేసిఆర్ సర్వ నాశనం చేశారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేశాం. దేశ చరిత్రలో మొట్ట మొదట సారి వరి సాగులో తెలంగాణ ముందు వరుసలో ఉంది. బిఆర్ఎస్ హయంలో రైతులు వరి కుప్పల మీద పడి చనిపోయిన ఘటనలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు’’ అని అన్నారు.

‘‘ప్రగతి భవన్ కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తుంది. కిషన్ రెడ్డి తో కేసిఆర్ మిలాఖత్ అయ్యి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ రైజింగ్..దళిత రైజింగ్..మహిళ రైజింగ్..హైదరాబాద్ రైజింగ్..రాజీవ్ యువ వికాస్ రైజింగ్ తో రాష్ట్రం అభివృద్ది. బిఆర్ఎస్ హయంలో కేసిఆర్ రైజింగ్..కేటీఆర్ రైజింగ్..కవిత రైజింగ్..హరీష్ రావు రైజింగ్.. జన్వాడ లో ఉన్నటువంటి ఫాం హౌస్ లు ఎవరివి? ధర్నా చౌక్ ఎత్తేసిన పాపం కేసిఆర్ ది కాదా? గద్దర్ ను అవమానించిన పాపం మిది కాదా? బిఆర్ఎస్ హయంలో ఎన్ని సార్లు పేపరు లీక్ అయిన పాపం మిది కాదా? కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు’’ అని అన్నారు.

Read More
Next Story