మీరు తప్పుచేసి మాపై నిందలా?
x

మీరు తప్పుచేసి మాపై నిందలా?

'ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు 'మంత్రి భట్టి ఆరోపణ


అధికారంలో వున్నప్పుడు అన్నీ తప్పులు చేశారు. ఇప్పుడేమో మేము తప్పులు చేస్తున్నామంటూ మమల్ని విమర్శిస్తున్నారు అంటూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలపై విరుచుకు పడ్డారు.ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు అన్ని ఘాటుగా విమర్శించారు.ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే,కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు.తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే వ్యవసాయం, కరెంటు, ప్రాజెక్టులు అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని విమర్శించారు.

ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్‌ ఆయకట్టుకు ఈరోజు నీరు విడుదల చేశారు. కార్యక్రమంలో భట్టి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.‘‘ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.12 వేలు అందించాం. వారి ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేశాం. సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా ఇస్తాం’’ అని పొంగులేటి తెలిపారు.సాగర్‌ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని,ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు.కృష్ణా బేసిన్‌లో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామన్నారు. రైతాంగాన్ని తగిన సమయంలో రైతుబంధు ,సాగునీరు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పొంగులేటి తెలిపారు.
Read More
Next Story