కేసీఆర్ క్లారిటి ఇచ్చేసినట్లేనా ?
x
BRS Chief KCR

కేసీఆర్ క్లారిటి ఇచ్చేసినట్లేనా ?

తనను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో మాట్లాడుతు పోటీకి పార్టీ దూరంగా ఉండాలని చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం


ఈనెలాఖరున మూడుసీట్లకు జరగబోయే ఎంఎల్సీఎన్నికల్లో పోటీవిషయమై కేసీఆర్ క్లారిటి ఇచ్చేసినట్లు సమాచారం. తనను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో మాట్లాడుతు పోటీకి పార్టీ దూరంగా ఉండాలని చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. పోటీకే కాదు చివరకు ఎన్నికల్లో పోటీచేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో ఎవరికీ మద్దతు కూడా ఇచ్చేదిలేదని తేల్చిచెప్పేశారు. అధికారికంగా పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదని కేసీఆర్(KCR) తేల్చేశారు కాబట్టి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు మద్దతిచ్చే విషయంలో పార్టీప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు తమిష్టప్రకారం నడుచుకునే స్వేచ్చ ఉంటుందనే అనుకుంటున్నారు.

ఈనెల 27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎంఎల్సీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీలకు(MLC elections) ఎన్నికలు జరుగుతాయి. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో రెండో టీచర్ ఎంఎల్సీ సీటుకు ఎన్నిక జరగబోతోంది. పై మూడుసీట్లను గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీజేపీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ(BJP) తన ముగ్గురు అభ్యర్ధులను కొద్దిరోజుల క్రితమే ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం తన అభ్యర్ధులను ఈమధ్యనే ప్రకటించింది. అధికారంలో ఉండటం, బీఆర్ఎస్(BRS) పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.

గ్రాడ్యుయేట్ సీటుకు పార్టీతరపున అభ్యర్ధిని పోటీచేయించాలని పార్టీనేతలు అడిగితే కేసీఆర్ తిరస్కరించినట్లు సమాచారం. టికెట్ ఆశిస్తున్న నేతలకు ఇదేవిషయాన్ని స్పష్టంగా చెప్పాలని కూడా కేసీఆర్ తనను కలిసిన నేతలకు చెప్పేశారు. పోటీకి నేతలు సిద్దంగా ఉన్నా కేసీఆర్ మాత్రం పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయించారు. కారణం ఏమిటంటే ఓటమిభయమే అని అర్ధమవుతోంది. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ బీఎన్ రావు, శేఖరరావు, రాజారాంయాదవ్ తదితరులు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ సీటులో పోటీకి ఎంతగా ప్రయత్నించినా కేసీఆర్ మాత్రం అంగీకరించలేదని పార్టీనేతలు చెప్పారు.

స్ధానికఎన్నికలకు ఓకే

ఎంఎల్సీ ఎన్నికలకు మాత్రమే పార్టీ దూరంగా ఉంటుందని తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో(Local body elections) పోటీకి రెడీ అని కేసీఆర్ అన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీని పోటీకి దూరంచేసిన ఓటమిభయం మరి స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీకి మాత్రం ఎందుకు లేదు ? దీనికి సమాధానం ఏమిటంటే ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లు పరిమితసంఖ్యలో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ ఓటర్లను మ్యానేజ్ చేసే అవకాశలున్నాయని కేసీఆర్ అనుమానించారు. కాంగ్రెస్ మ్యానేజ్మెంట్ కారణంగా బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీపై కోలుకోలేని నెగిటివ్ దెబ్బపడటం ఖాయమని కేసీఆర్ భావించారు. అదే స్ధానికసంస్ధల ఎన్నికలంటే ఓటర్లు కోట్లమందుంటారు. జనరల్ ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ఓట్లేశారో స్ధానికసంస్ధల ఎన్నికల్లోనూ అంతమందీ ఓట్లేస్తారు. ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లను మ్యానేజ్ చేసినంత ఈజీకాదు స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఓటర్లందరినీ మ్యానేజ్ చేయటం. కాబట్టే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హైదరాబాద్ కు తిరిగొచ్చిన తర్వాత ఈ విషయమై ఫుల్లుగా ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం.

Read More
Next Story