ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
x

ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్

ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటలపాటు బ్యాన్ చేయడంపై కేసీఆర్ స్పందించారు. మహబూబాబాద్ రోడ్ షో లో కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.


ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటలపాటు బ్యాన్ చేయడంపై కేసీఆర్ స్పందించారు. మహబూబాబాద్ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ.. నా మీద ఈసీ 48 గంటలు ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది.. ఇదే రేవంత్ రెడ్డి నా మీద పేగులు మెడలేసుకుంటా, గుడ్లు పీకుతా అంటే రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేధం పెట్టలేదు. నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపిస్తున్నా.. నా మీద 48 గంటలు నిషేధం విధిస్తే, మీరు 96 గంటలు ప్రచారం చేయండి" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. విషయం ఏమిటంటే తన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రత్యర్ధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు అందింది. ఆ ఫిర్యాదులను నిసితంగా గమనించిన కమీషన్ 48 గంటలపాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకుండా బ్యాన్ విధించింది. కేసీఆర్ ఎక్కడ మాట్లాడినా ఇటు రేవంత్ రెడ్డిపైన అటు నరేంద్రమోడిపైన విరుచుకుపడుతున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలతో పాటు కమలంపార్టీ నేతలు కూడా కేసీఆర్ మాట్లాడిన క్లిప్పింగులను, చేసిన అనుచిత వ్యాఖ్యలను కమీషన్ కు ఫిర్యాదు రూపంలో అందించారు.

ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమీషన్ కేసీఆర్ ప్రచారంపై బాగా సీరియస్ అయ్యింది. అందుకనే 48 గంటలు ప్రచారం చేయటానికి వీల్లేదంటు ఆదేశాలు జారీచేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రచారాన్ని 48 గంటలపాటు కమీషన్ నిషేధించటం బహుశా తెలంగాణాలో ఇదే మొదటిసారేమో. ఏప్రిల్ 5వ తేదీన కేసీఆర్ సిరిసిల్ల పర్యటనలో మాట్లాడుతు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కమీషన్ అభిప్రాయపడింది.

రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ కమీషన్ కు ఫిర్యాదుచేశారు. దానిపై కమీషన్ కేసీఆర్‌ను వివరణ కోరుతు నోటీసులు జారీచేసింది. కేసీఆర్ ఏప్రిల్ 27వ తేదీన సమాధానం ఇచ్చినా కమీషన్ సంతృప్తి వ్యక్తంచేయలేదు. అందుకనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధిస్తు కమీషన్ ఆదేశాలు జారీచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించారని, కాంగ్రెస్ నేతలను మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసభ్యపదజాలం ప్రయోగించారని నిరంజన్ ఫిర్యాదుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాష ఎన్నికల కోడ్ ఉల్లంఘనకిందకు వస్తుందని దీనిమీద కేసీఆర్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కమీషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read More
Next Story