ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన కేసీయార్
x
KCR

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన కేసీయార్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కేసీయార్ జోస్యం చెప్పారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కేసీయార్ జోస్యం చెప్పారు. తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కూటమి మధ్య హోరాహోరీగా పోరాటం జరుగుతోంది. జగన్, చంద్రబాబు ఇద్దరికీ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. జరగబోయే ఎన్నికల్లో జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. అలాగే లోకేష్ రాజకీయ భవిష్యత్తుతో పాటు పార్టీ భవిష్యత్తుకూడా ఇబ్బందుల్లో పడుతుంది. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. పవన్ హ్యాపీగా సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోతారు. తీరికున్నపుడు వచ్చి జగన్ను తిట్టేసి వెళ్ళిపోతారు.

ఇక బీజేపీ ఓటమి అంటారా ఆ పార్టీకి ఉన్నదంటు ఏమీలేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు. కాకపోతే పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి మాత్రం బాధతప్పదు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకపోయినా చికాకులు అయితే తప్పవు. కాబట్టే గెలుపుకోసం జగన్, చంద్రబాబు ఇద్దరు ఇంతగా పోరాడుతున్నది. ఈ నేపధ్యంలోనే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేసీయార్ మాట్లాడుతు ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయాన్ని తాను ప్రస్తావించటం బాగుండదన్నారు. అయితే గెలుపు విషయాన్ని యాంకర్ మళ్ళీ ప్రస్తావించినపుడు తనకున్న సమాచారం ఆధారంగా జగనే గెలుస్తారని చెప్పారు.

ఏపీలో జగన్, చంద్రబాబులో ఎవరు గెలిస్తే తెలంగాణాకు బాగుంటుందన్న ప్రశ్నకు ఎవరు గెలిచినా తెలంగాణాకు ఇబ్బంది ఉండదన్నారు. తాను ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపటంలేదన్నారు. ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీస్ విషయాన్ని కూడా పక్కనపెట్టినట్లు చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇపుడు దుమ్మురేపుతుండేదన్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 98 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్ తొందరలోనే జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. తాను సీఎం అవటం ఖాయమని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కూడా జనాలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్ గా మారదని స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పూర్తికాలం అధికారంలో ఉంటేకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన పాలనకు జనాలకు తేడా తెలీదన్నారు. మొన్నటి ఎన్నికల్లో జనాలు మోసపోయి కాంగ్రెస్ కు ఓట్లేసినట్లు చెప్పారు. ఆ విషయాన్ని ఈ ఐదు మాసాల్లోనే ప్రజలందరు తెలుసుకున్నట్లు కేసీయార్ వివరించారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందేమో అనే అనుమానాలను కూడా కేసీయార్ వ్యక్తంచేశారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్నాటక ప్రభుత్వాలను కూల్చటానికి బీజేపీ రెడీగా ఉందన్నారు. పై రెండు ప్రభుత్వాలను కూల్చేసిన తర్వాత కూలబోయే మూడో ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వమే అని జోస్యంచెప్పారు.

Read More
Next Story