కెసిఆర్ కు డబల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానన్న రేవంత్.  ఎక్కడ, ఎందుకు?
x
cm revanthreddy

కెసిఆర్ కు డబల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానన్న రేవంత్. ఎక్కడ, ఎందుకు?

తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జనజాతర సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రికి డబుల్ బెడ్ రూం కట్టిస్తానని ప్రకటించారు.వివరాలు...


కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాజీ ముఖ్య మంత్రి బిఆర్ ఎస్ అధినేత కుల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పారు. ముఖ్యంగా కెసిఆర్ వాడుతున్న అసభ్య పదజాలానికి ఘాటైన జవాబు చెప్పారు. మరీ ముఖ్యంగ మూడు రోజుల కిందట కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ కేసిఆర్ చాలా అభ్యంతరకరమయిన పదజాలం వాడి కాంగ్రెస్ ను, తనపి దూషించిన విషయం రేవంత్ ప్రస్తావించారు. రేవంత్ ఇలా ప్రసంగం ప్రారంభించారు...


‘‘ఓ నక్క మొన్న సూర్యాపేటకు నిన్న కరీంనగర్ కు పోయింది,అక్కడ వెంట్రుక కూడా పీకలేరని అనింది. పదేళ్లపాటు తెలంగాణను పీడించి దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేం కొంతకాలం సంయమనం పాటించాం, మర్యాదపూర్వకంగా మాట్లాడాం, కానీ కేసీఆర్ మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా’’ అని రేవంత్ హెచ్చరించారు.

‘‘పదేళ్లలో నీవు పేదలకు డబుల్ బెడ్రూంలు కట్టిస్తానన్నావు. కట్టించలేదు. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా. నీకూతరు అల్లుడు వస్తే ఉండటానికి వీలుగా, నీ కొడుకు కోడలు వస్తే ఉండటానికి వీలుగా డబల్ బెడ్ రూం కట్టిస్తా. ఎక్కడ, చర్లపల్లి జైలులో ’’ అని సీఎం అన్నారు.

పదేళ్ల అధికారంలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం సృష్టించాడని రేవంత్ ఆరోపించారు. ‘‘మోదీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బీజేపీని బొంద పెట్టే వరకు నిద్రపోకూడదు’’ అని రేవంత్ చెప్పారు.


ఇందిరమ్మ గ్యారంటీలు అమలు చేశాం

డిసెంబరు 7 వతేదీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ గ్యారంటీల అమలు చేశామని, ఆర్థిక ఇబ్బందులున్నా 1వతేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టామని రేవంత్ చెప్పారు.‘‘ 100రోజుల్లో నా పాలన మీ ముందుంచాం, వందరోజుల్లో మంచి పాలన ఇస్తే,ఆరు గ్యారంటీల అమలుచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, ఢిల్లీ నుంచి నిధులు సాధించాలంటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించండి’’అని రేవంత్ కోరారు.

మోదీ పరివారానికి, గాంధీ పరివారానికి జరుగుతున్న పోరాటం
ఈ పార్లమెంటు ఎన్నికలు మోదీ పరివారానికి, గాంధీ పరివారానికి జరుగుతున్న పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ఈ ఎన్నికల్లో ఈవీఎం, ఈడీ, సీబీఐ, ఇన్ కంట్యాక్స్ మోదీ పరివారం, గాంధీ పరివారం అంటే దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడిన కుటుంబం రాహుల్ గాంధీ పరివారం...ఈ రెండు పరివారాల మధ్య పోరాటానికి మీరు సిద్ధమా అని రేవంత్ ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపించడానికి సిద్ధమా’’ అని రేవంత్ ప్రజలను ప్రశ్నించి వారితో చేతులు పైకెత్తి చెప్పాలని కోరారు. రేవంత్ పిలుపునకు జనం స్పందించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది...
ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ను ఓడించినట్లే బీజేపీని కూడా ఓడించాలని సీఎం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడించిన ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మోదీని ఇంటికి పంపించాలని కోరారు. పదేళ్లలో బీజేపీ ప్రజలకు ఏం చేసిందని రేవంత్ ప్రశ్నించారు.


Read More
Next Story