
కోలాహలంగా బడే గణేశుడి నిమజ్జనం
కదలి వచ్చిన గణేశులతో సందడి సందడిగా ట్యాంక్ బండ్.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో మహాగణపతి నిమజ్జణ వేడుక కోలాహలంగా జరుగుతోంది. మహాగణపతికి సాగనంపడానికి వేలాది మంది భక్తులు వచ్చారు. భక్తుల నీరాజనాలు, గణపతి స్తోత్రాలతో శోభాయాత్ర మరింత శోభను అందుకుంది.
మరికాసేపట్లో ట్యాంక్ బండ్ వద్ద మహాగణతి నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌కు వెళ్లే మార్గాలన్నీ భక్తులో నిండిపోయాయి. బడా గణేష్ శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ సహా మాగణపతి వెళ్లే మార్గమంతా భక్తులతో నిండిపోయింది.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జణాలు వరుసగా జరుగుతున్నాయి. దాదాపు 40 గంటల పాటు ఈ నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులకు, విగ్రహా నిర్వహాకులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
డ్రోన్‌లు, ప్రత్యేక బృందాలతో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 250 సీసీ కెమెరాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు, 30 వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో అన్ని శాఖల అధికారుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3 వేలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద 40 క్రేన్‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం వీక్షించేందుకు 10 లక్షల మంది వస్తారని పోలీసులు అంచనా చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
లడ్డూ రూ.35లక్షలు
మరోవైపు బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ఘనంగా సాగింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు.
గతేడాది ఈ లడ్డూను రూ.30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి లడ్డూ ధర రూ.4.99 లక్షలు అధికంగా పలికింది. లడ్డూ విజేత దశరథగౌడ్‌ను ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సన్మానించింది.