పదవులు ఎవరికి పడితే వారికి రావు: ఖర్గే
x

పదవులు ఎవరికి పడితే వారికి రావు: ఖర్గే

పార్టీ పదవులను భర్తీ చేసే విషయంతో మంత్రులు కూడా చొరవ తీసుకుని జాబితాలు ఇవ్వాలి.


పార్టీ నేతలు, కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులు కట్టి బెదిరించాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. నలుగు గ్రూపులు కడితే తాము బెదిరిపోతామని, భయపడిపోతామని అనుకుంటే పొరపాటేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీ నిబంధనలకు తలొగ్గి పనిచేయాల్సిందేనని, లేకపోతే పార్టీ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇటీవల కాలంలో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారు ఇప్పటికయినా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడతానంటే చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు కూడా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగానే పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

వారకే పదువులు..

‘‘జులై 30లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఈ బాధ్యత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌దే. పదవులు ఎవరికి పడితే వారికి దక్కవు. పార్టీ కోసం కష్టపడిన వారికి, కృషి చేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయి. పార్టీలో పనిచేసిన వారికి, అర్హత ఉన్నవారికే పదవులు ఇవ్వాలి’’ అని అన్నారు. కాగా పార్టీ పదవులను భర్తీ చేసే విషయంతో మంత్రులు కూడా చొరవ తీసుకుని జాబితాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read More
Next Story