రాధాకిషన్ రావు మెడకి చుట్టుకున్న మరో కేసు
x

రాధాకిషన్ రావు మెడకి చుట్టుకున్న మరో కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావుపై మరో కేసు నమోదైంది. ఆయన బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావుపై మరో కేసు నమోదైంది. ఆయన బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఆయనపై కిడ్నాప్, దోపిడీ కేసు నమోదు అయింది. ఈ కేసులో బాధితుడు క్రియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు వేణుమాధవ్ చెన్నుపాటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి తనపై ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంస్థలో ఉన్న యాజమాన్య హక్కులను కూడా మార్పించేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రాధాకృష్ణన్ రావుతో పాటు ఆయనకి సహాయం చేసిన సీఐ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జున్, ఇతర పోలీస్ అధికారులు, వేణుమాధవ్ బిజినెస్ పార్టనర్స్ పై కేసు నమోదు చేశారు. 2018 నవంబర్ లో తనని టాస్క్ ఫోర్స్ ఆఫీసుకి తీసుకువెళ్ళారు అని వేణు మాధవ్ తెలిపారు. బలవంతంగా రూ.100 కోట్లు విలువ చేసే తన షేర్లను రెయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గన్నులు, ఇతర ఆయుధాలతో బెదిరించి నాతో డాక్యుమెంట్స్ పై సంతకం చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు రాధాకిషన్ రావు అరెస్టు కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా రాధా కిషన్ తో సహా నలుగురు అధికారులపై ఐపిసి సెక్షన్ 386, 365, 341, 120(B) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ ఈరోజుతో ముగియాల్సి ఉంది. పోలీసులు బుధవారం ఉదయం ఆయనని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. ఈ నెల 12 వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా లైబ్రరీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతినివ్వడం లేదని రాధాకిషన్ రావు కోర్టుకి తెలిపారు. జైలు సూపరింటెండెంట్ ని కలవనివ్వడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. రాధాకిషన్ రావుని లైబ్రరీకి వెళ్ళడానికి, సూపరింటెండెంట్ ని కలవడానికి పర్మిషన్ ఇచ్చింది.

Read More
Next Story