
కల్తీ కల్లు వల్లే కిడ్నీలు పాడయ్యాయి : నిమ్స్
9 మందికి కిడ్నీలు పనికి రాకుండా పోయాయి
కల్తీకల్లు తాగినందుకే చాలామంది కిడ్నీలు చెడిపోయి ఆస్పత్రి పాలయ్యారని నిమ్స్ వైద్యులు తెలిపారు. కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నారని వైద్యులు చెప్పారు. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 33 మంది బాధితులకు నిమ్స్ లో చికిత్స కొనసాగుతుంది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితులే ఎక్కువగా ఉన్నారు. కల్తీ కల్లు కాటుకు ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కిడ్నీలు పూర్తిగా పనికి రాకుండా పోయిన వారి సంఖ్య తొమ్మిది మంది ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు పేషెంట్లు డయాలసిస్ చికిత్స కొనసాగుతుంది.
11 మంది ఆరోగ్యం నిలకడగా ఉంటే మరో 12 మందికి అబ్జర్వేషన్ చికిత్స కొనసాగుతుంది. మరో 20మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.కాగా కల్తీ కల్లు ఘటనలో ప్రధాన నిందితుడు కూన సత్యం గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన కుమారులైన రవితేజ గౌడ్, సాయి తేజ గౌడ్ ను పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 5గురు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనలో బాలానగర్ సిఐ వేణు పై వేటుపడింది. కల్తీ కల్లు నివారించడంలో వేణుకుమార్ వైఫల్యం చెందినట్లు అతడిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
తెలంగాణలోకలకలం రేపిన కల్తీకల్లు ఘటనలో కూకట్ పల్లి, కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్లలో చెరో మూడు కేసులు నమోదయ్యాయి. బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ లో ఆరు కేసులు నమోదయ్యాయి.