కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం
x

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం

తాగిన మైకంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ


కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం అర్ధ రాత్రి కత్తిపోట్ల కలకలం రేపింది. మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పొట్ట, వీపు భాగాలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెండు గ్రూపులను చెదరగొట్టారు. గాయపడ్డవారిలో రాహుల్, మణిరాజు, మణికంఠ, కిరణ్, బాల రాజు తదితరులు ఉన్నారు. వీరిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన శాస్త్రి దుర్గా మాత దాండియా వద్ద దసరావేడుకలు జరుగుతుండగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తిపోట్ల ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Read More
Next Story