
మీనాక్షి నటరాజన్ ను కల్సిన కొండా దంపతులు
తమపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా దంపతుల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కొండా దంపతులు గురువారం హైద్రాబాద్ ఎమ్మెల్యేక్వార్టర్ లో ఎఐసిసి తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. 16 పేజీల నివేదికను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కి సమర్పించారు.
తమపై బురదచల్లడానికే వరంగల్ కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తున్నట్టు కొండా దంపతులు మీడియాకి చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని వారు క్లారిటీ ఇచ్చారు. ‘‘నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతే తమపై చర్య తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ గారిని కోరాం అని వారు తెలిపారు. తమపై నాయిని చేసిన వ్యాఖ్యలు మేడం దృష్టికి తెచ్చాం అని కొండా దంపతులు తెలిపారు.
నాగార్జున కుటుంబంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలనే కొందరు వక్రీకరించారని కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు గూర్చి మేడం దృష్టికి తెచ్చినట్టు వారు వివరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో హైకమాండ్ ఎవరి పేరు అనౌన్స్ చేసినప్పటికీ తమ మద్దత్తు ఉంటుందని కొండా దంపతులు చెప్పారు. బీసీల అభ్యున్నతికి తాము పిసిసికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.